బ్లాస్టింగ్ జరగలేదు.. మల్లన్నసాగర్‌కు ముప్పు లేదు
ABN , Publish Date - Oct 31 , 2026 | 04:43 AM
మూసీ సుందరీకరణ కోసం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామంలో పంప్‌హౌస్ నిర్మిస్తున్న ప్రాంతంలో ఎలాంటి బ్లాస్టింగ్‌జరగలేదని నీటిపారుదల శాఖ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) అధికారులు తెలిపారు.
కట్టకు 293 మీటర్ల దూరంలో నిర్మాణ పనులు
రసాయనాలతో రాయిని క్రాకింగ్ చేశాం
ఇరిగేషన్, వాటర్ బోర్డు అధికారుల వెల్లడి
తిప్పారం పంప్‌హౌస్ వద్ద క్షేత్రస్థాయి పరిశీలన
బ్లాస్టింగ్ చేస్తున్న ఏజెన్సీపై కేసు పెట్టాలి
పోలీసులకు బీఆర్‌ఎస్ గజ్వేల్ ఇన్‌చార్జి ఫిర్యాదు
గజ్వేల్/కుకునూరుపల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మూసీ సుందరీకరణ కోసం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారం గ్రామంలో పంప్‌హౌస్ నిర్మిస్తున్న ప్రాంతంలో ఎలాంటి బ్లాస్టింగ్‌జరగలేదని నీటిపారుదల శాఖ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) అధికారులు తెలిపారు. మల్లన్నసాగర్ కట్టకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. పంప్‌హౌస్ వద్ద అనుమతుల్లేకుండా బ్లాస్టింగ్ చేశారని, మల్లన్నసాగర్ కట్టను ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని బీఆర్‌ఎ్‌సఎల్పీ ఉపనేత హరీశ్‌రావు గురువారం ఆరోపించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ, హెచ్‌ఎండబ్ల్యూఎ్‌సఎ్‌సబీ ఉన్నతాధికారుల బృందం శుక్రవారం మల్లన్నసాగర్ రిజర్వాయర్ చేరువలోని తిప్పారం పంప్‌హౌస్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించింది.
అక్కడ కొలతలు వేసి.. పంప్‌హౌస్ నిర్మాణ ప్రాంతానికి మల్లన్నసాగర్ కట్ట 293 మీటర్ల దూరంలో ఉందని నిర్ధారించారు. అక్కడ కనిపిస్తున్న సీపేజీ నీటి వల్ల కూడా కట్టకు ఎలాంటి ముప్పులేదని తెలిపారు. నాలుగు నెలల క్రితం తవ్వకాల సమయంలో భారీ బండరాయి అడ్డురావడంతో దానికి రంధ్రాలు చేసి రసాయనాలు నింపినట్లు పేర్కొన్నారు. మరుసటి రోజు యంత్రాల సహాయంతో రాయిని క్రాకింగ్ చేశామని, ఎలాంటి బ్లాస్టింగ్ నిర్వహించలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. మల్లన్నసాగర్ కట్ట వద్ద అక్రమంగా బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్న ఏజెన్సీపై కేసు నమోదు చేయాలంటూ బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతా్‌పరెడ్డి శుక్రవారం కుకూనురుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజర్వాయర్ కట్టకు 200 మీటర్లలోపే అనుమతుల్లేకుండా బ్లాస్టింగ్‌లు చేపడుతున్నారని ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యాదగిరీశుడి సన్నిధిలో వర్సిటీ ప్రతిపాదన
హైస్పీడ్ రైళ్ల పనులను వేగవంతం చేయండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News