Share News

హైస్పీడ్‌ రైళ్ల పనులను వేగవంతం చేయండి

ABN , Publish Date - Oct 31 , 2026 | 04:09 AM

తెలంగాణలో హైస్పీడ్‌ రైళ్ల పనులను వేగవంతం చేయాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

హైస్పీడ్‌ రైళ్ల పనులను వేగవంతం చేయండి
Revanth Reddy, Ashwini Vaishnaw

  • అలైన్‌మెంట్‌ ఖరారైతే భూసేకరణ ప్రారంభిస్తాం..

  • రాష్ట్రానికి నూతన రైలు మార్గాల మంజూరు

  • అనంతారంలో మెగాఫ్రైట్‌ మెయింటెనెన్స్‌ డిపో

  • రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో హైస్పీడ్‌ రైళ్ల పనులను వేగవంతం చేయాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఢిల్లీలోని రైల్‌ భవన్‌లో అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం సమావేశమయ్యారు. హైదరాబాద్‌-పుణె, హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లకు సంబంధించి కేంద్రప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష జరిపి కొన్ని మార్పులను సూచించిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అలైన్‌మెంట్‌ను కేంద్రం ఆమోదించిన తర్వాత భూసేకరణను ప్రారంభిస్తామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా అలైన్‌మెంట్‌ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. వికారాబాద్‌-కృష్ణా కొత్త రైలుమార్గాన్ని (130 కి.మీ.) వెంటనే మంజూరు చేయాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్‌ కోరారు.


వికారాబాద్‌ జిల్లా టేకల్‌కోడ్‌ పరిసరాల్లో భారీ సున్నపురాయి నిక్షేపా లు బయటపడ్డాయని, దీంతో ఈప్రాంతాన్ని సిమెంట్‌, టెక్స్‌టైల్‌ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వివరించారు. హైదరాబాద్‌ చుట్టూ 360 కి.మీ.ల మేర నిర్మిస్తున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) పక్కనే రీజినల్‌ రింగ్‌ రైలును అలైన్‌మెంట్‌ చేయాలని కోరారు. ఫలితంగా, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. డోర్నకల్‌-గద్వాల్‌, కల్వకుర్తి-మాచర్ల, కాచిగూడ-జగ్గయ్యపేట (250కి.మీ.), పటాన్‌చెరు-ఆదిలాబాద్‌ (320కి.మీ.),బోధన్‌-లాతూర్‌ (175 కి.మీ.), అక్కన్నపేట బైపాస్‌ లైన్‌ (8కి.మీ.) మార్గాలను వెంటనే మం జూరు చేయాలని సీఎం కోరారు.


డిపో ఏర్పాటుకు 409 ఎకరాలు ఇస్తాం

దక్షిణ మధ్య రైల్వే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మెగా కోచింగ్‌, ఫ్రైట్‌ మెయింటెనెన్స్‌ డిపోను మహబూబాబాద్‌ సమీపంలోని అనంతా రంలో ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ఈ డిపో ఏర్పాటుకు 409ఎకరాల 1 గుంట భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు సిద్ధమని ఇప్పటికే తెలియజేశామన్నారు. సమావేశంలో మంత్రి వివేక్‌ వెంకటస్వామి, ఎంపీలు డాక్టర్‌ మల్లురవి, వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, బలరాం నాయక్‌, గడ్డం వంశీకృష్ణ, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా దేశానికి ఆమె చేసిన సేవలను సీఎం రేవంత్‌రెడ్డి స్మరిం చుకున్నారు. దేశ సమగ్రత, సమైక్యత పటిష్టత కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుం డా పని చేసిన ధీశాలి అని కొనియాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మియాపూర్‌ భూములు కొల్లగొట్టేందుకు..కేసీఆర్‌కు ముడుపులు

మహిళల హాస్టల్‌ మాటున అండాల సేకరణ?

ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 04:09 AM