Share News

యాదగిరీశుడి సన్నిధిలో వర్సిటీ ప్రతిపాదన

ABN , Publish Date - Oct 31 , 2026 | 04:15 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయసన్నిధిలో పూర్తిస్థాయి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశామని, ప్రభుత్వం అనుమతులు మంజూరుచేస్తే ఆ దిశగా ముందుకు సాగనున్నట్టు యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ డాక్టర్‌ మన్నె సత్యనారాయణరెడ్డి తెలిపారు.

యాదగిరీశుడి సన్నిధిలో వర్సిటీ ప్రతిపాదన
Yadadri Temple Development

  • పదేళ్లలో తిరుమల స్థాయిలో ఆలయ అభివృద్ధి

  • దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ మన్నె సత్యనారాయణ రెడ్డి

  • రూ.13 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ

యాదాద్రి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయసన్నిధిలో పూర్తిస్థాయి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశామని, ప్రభుత్వం అనుమతులు మంజూరుచేస్తే ఆ దిశగా ముందుకు సాగనున్నట్టు యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ డాక్టర్‌ మన్నె సత్యనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన.. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి యాదగిరిగుట్టపై స్వామివారి నిత్యకల్యాణ మండపం, హైదరాబాద్‌-వరంగల్‌ హైవేపై రాయిగిరి వద్ద భారీ స్వాగత తోరణం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ ఆలయ సమీపంలో ఇప్పటికే వేద పాఠశాల, వేద విశ్వవిద్యాలయం, గోశాల ఏర్పాటవుతున్నాయని, ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం జరుగుతోందన్నారు. యాదగిరిగుట్టను తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.


కొండపై దాదాపు రూ.10కోట్లతో స్వామివారి నిత్యకల్యాణ మండపం, రూ.3.16 కోట్ల నిధులతో రాయిగిరి వద్ద 100అడుగుల వెడల్పు, 30అడుగుల ఎత్తుతో పంచనరసింహుల విగ్రహాలతో అద్భుత రాతి శిల్పాలతో ఆర్చి గేటును తన ఖర్చుతో నిర్మాణం చేయిస్తున్నట్లుగా తెలిపారు. ఈ పనులను ఏడాదిలో పూర్తిచేస్తామన్నారు. దాతల సహకారంతో రూ.43కోట్లతో దీక్షాపరుల మండప నిర్మాణం చేపట్టనున్నట్టుగా పేర్కొన్నారు. ప్రస్తుతం నిత్యాన్నప్రసాదం రోజుకు 2000మందికి అందిస్తుండగా, అవసరాలకు అనుగుణంగా పెంచుతామన్నారు. స్వామివారి దర్శనం, ఇతర ఆర్జిత సేవలు సులభంగా పొందడానికి టీసీఎస్‌ సహకారంతో ఆన్‌లైన్‌ సేవలను నాలుగు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, ఎమ్మెల్యే గడ్డం వినోద్‌, టి.విజయేందర్‌గౌడ్‌, ఈశ్వరమ్మ, గుండ మల్లయ్య, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మియాపూర్‌ భూములు కొల్లగొట్టేందుకు..కేసీఆర్‌కు ముడుపులు

మహిళల హాస్టల్‌ మాటున అండాల సేకరణ?

హైస్పీడ్‌ రైళ్ల పనులను వేగవంతం చేయండి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 04:15 AM