Share News

నకిలీ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

ABN , Publish Date - Nov 23 , 2026 | 08:58 PM

నకిలీ నంబర్ ప్లేట్ల వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నకిలీ, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారం రోజుల్లో ఫేక్ నంబర్ ప్లేట్లను ఉపయోగించిన వారిపై 5 క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

నకిలీ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం
Fake Number Plates

హైదరాబాద్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): నకిలీ నంబర్ ప్లేట్ల వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు (సోమవారం) స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నకిలీ, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. వారం రోజుల్లో ఫేక్ నంబర్ ప్లేట్లను ఉపయోగించిన వారిపై 5 క్రిమినల్ కేసులను నమోదు చేశారు. వాహనాల అసలు గుర్తింపును దాచేందుకు ఫేక్ నంబర్ ప్లేట్లను వినియోగించినట్లు గుర్తించారు. ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి నంబర్ ప్లేట్లతో వాహనదారులు మార్పులు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


ప్రత్యేక తనిఖీల్లో పలు వాహనాలను గుర్తించి పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్‌తో పాటు మరో నాలుగు జిల్లాల్లో ఈ కేసులను నమోదు చేశారు. కామారెడ్డి టౌన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, వికారాబాద్ జిల్లా దుడ్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ అనుమతి పొందిన HSRP నంబర్ ప్లేట్లను మాత్రమే వినియోగించాలని పోలీసులు సూచించారు. నంబర్లను తొలగించడం, మార్చడం, స్టిక్కర్లతో తాత్కాలిక నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని అన్నారు.


నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఫేక్ నంబర్ ప్లేట్ల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్నారు. వాహనదారులందరూ నిబంధనల ప్రకారం నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. నగరవ్యాప్తంగా నకిలీ నంబర్ ప్లేట్లపై తనిఖీలు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 23 , 2026 | 09:08 PM