Share News

నకిలీ, ట్యాంపరింగ్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం

ABN , Publish Date - Aug 08 , 2026 | 07:45 PM

నకిలీ, ట్యాంపరింగ్ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అలాగే ఈనంబర్ ప్లేట్లపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

నకిలీ, ట్యాంపరింగ్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఉక్కుపాదం
Hyderabad Traffic Police

హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): నకిలీ, ట్యాంపరింగ్ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) ఉక్కుపాదం మోపారు. అలాగే ఈ నంబర్ ప్లేట్లపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ చలానాల తప్పించుకునేందుకు ఫేక్ నంబర్ ప్లేట్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐదు క్రిమినల్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు.


ఆ వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పంజాగుట్ట, చిలకలగూడ, దిండి, కంచన్‌బాగ్, చాంద్రాయణగుట్ట/బాండ్లగూడ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశామని వివరించారు. ఆయా వాహనాలకు ప్రభుత్వం ఆమోదించిన HSRP నంబర్ ప్లేట్లు మాత్రమే ఉండాలని సూచించారు. నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, ఫేక్ నంబర్లపై 'జీరో టాలరెన్స్' విధానం అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. నకిలీ, ట్యాంపరింగ్ నంబర్ ప్లేట్లు ఉండే వాహనాలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు తప్పవని జోయల్ డేవిస్ హెచ్చరించారు.


వార్తలు కూడా చదవండి...

జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి నాకు రెండు నిమిషాలు చాలు: సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ మానవత్వం.. కళాకారుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు

శ్రీకాళహస్తి వ్యాసాశ్రమం వివాదం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 07:59 PM