డేటింగ్ పేరుతో వలపన్ని రూ.3.35 కోట్ల మోసం
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:35 PM
టిండర్ డేటింగ్ యాప్ ద్వారా ఓ మహిళ భారీ మోసానికి పాల్పడింది. డేటింగ్ పేరుతో వలపన్ని ఓ మహిళ రూ.3.35 కోట్ల మోసం చేసింది. ఫేస్‌బుక్, మెటాకు సంబంధించిన ప్రకటన ద్వారా.. భారీగా ఆదాయం ఆర్జించవచ్చని నమ్మించి మోసం చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): టిండర్ డేటింగ్ యాప్ ద్వారా ఓ మహిళ భారీ మోసానికి పాల్పడింది. డేటింగ్ పేరుతో వలపన్ని ఓ మహిళ రూ.3.35 కోట్ల మోసం చేసింది. ఫేస్‌బుక్, మెటాకు సంబంధించిన ప్రకటన ద్వారా.. భారీగా ఆదాయం ఆర్జించవచ్చని నమ్మించి మోసం చేసింది. ప్రారంభంలో పెట్టుబడి ద్వారా లాభాలు వచ్చినట్లుగా చూపించి మోసాలకు సదరు మహిళ పాల్పడింది. 55 రోజుల వ్యవధిలో బాధితుడి నుంచి రూ.3.35 కోట్లను తనకు సంబంధించిన ఖాతాకు బదిలీ చేయించుకుంది. డబ్బు రిటర్న్ కోసం ప్రయత్నించగా క్రెడిట్ స్కోర్ తగ్గిందని.. మరింత డబ్బు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో టీజీ సీఎస్‌బీని బాధితుడు ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేత్రపర్వంగా ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్
చేయూత పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ చేసింది వీరే.. కీలక వివరాలు వెల్లడించిన డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News