Share News

హోంగార్డు రెండో పెళ్లి.. రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్‌కు..!

ABN , Publish Date - Mar 07 , 2026 | 08:50 AM

భార్యాపిల్లలు ఉన్నా ఇంటర్మీడియట్ చదువున్న యువతిని ప్రేమలో దింపిన ఓ హోంగార్డు వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం కారణంగా రక్షణ కోసం సదరు హోంగార్డు బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించాడు.

హోంగార్డు రెండో పెళ్లి.. రక్షణ కావాలంటూ పోలీస్ స్టేషన్‌కు..!
Home Guard Love Marriage Controversy

హైదరాబాద్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఓ హోంగార్డు తన బాధ్యతను మరచి, పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా.. ఒక యువతిని వివాహం చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంతో రక్షణ కోసం సదరు హోంగార్డు బంజారాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించాడు.


మేడారం జాతరలో పరిచయం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడారం జాతరలో సదరు హోంగార్డుకు, ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ యువతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కేవలం 20 రోజుల్లోనే వారిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లి వెనుక ఉన్న అసలు నిజాలు బయటపడటంతో ఈ ఉదంతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరింది.


పోలీసుల విచారణ..

సదరు హోంగార్డుకు అప్పటికే వివాహమై భార్యాపిల్లలు ఉన్నారు. ఈ విషయం దాచిపెట్టి యువతిని ప్రేమలో దింపినట్లు తెలుస్తోంది. తన రెండో పెళ్లి విషయం బయటపడటంతో, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ సదరు హోంగార్డు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు. బంజారాహిల్స్ పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఈ వివాహంపై హోంగార్డు మొదటి భార్య ఫిర్యాదు చేసిందా..?, యువతి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు..? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి చట్ట విరుద్ధంగా రెండో వివాహం చేసుకోవడంపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ సమస్యపై సీఎం రేవంత్‌‌రెడ్డికి కిషన్‌రెడ్డి లేఖ

బేగంపేటలో బాంబు కలకలం.. అధికారులు అప్రమత్తం

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 07 , 2026 | 09:31 AM