Share News

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. భార్యను గొంతు కోసి చంపిన భర్త

ABN , Publish Date - Nov 18 , 2026 | 08:09 AM

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్‌లో అస్మాబేగం (30) అనే గృహిణి దారుణ హత్యకు గురైంది. కట్టుకున్న భార్యను కత్తితో గొంతు కోసి భర్త హత్య చేశాడు.

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. భార్యను గొంతు కోసి చంపిన భర్త
Hyderabad Old City Incident

హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్‌లో అస్మాబేగం (30) అనే గృహిణి దారుణ హత్యకు గురైంది. కట్టుకున్న భార్యను కత్తితో గొంతు కోసి భర్త హత్య చేశాడు. ప్రేమ వివాహం చేసుకుని 15 ఏళ్ల క్రితం బిహార్ నుంచి వచ్చి హైదరాబాద్ పాతబస్తీ హసన్ నగర్‌లో ధర్మేందర్, అస్మా దంపతులు స్థిరపడ్డారు.


నిన్న (మంగళవారం) సాయంత్రం 7 గంటల సమయంలో భార్య గొంతు కోసి, మూడేళ్ల కుమార్తెను తీసుకుని భర్త ధర్మేందర్ పరారయ్యాడు. ఘటనాస్థలాన్ని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్, ఫలక్‌నుమా ఏసీపీ ఎంఏ జావేద్ పరిశీలించి, వివరాలు సేకరించారు. నిందితుడిపై బీఎన్ఎస్ (BNS) చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అతడి కోసం ముమ్మరంగా బహదూర్‌పురా పోలీసులు గాలిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సమ్మక్క సాగర్‌ బ్యారేజీ.. ఎన్‌ఓసీ జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం..!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మంత్రి శ్రీధర్‌బాబు

సుప్రీంకోర్టుకు చేరిన 'భారత్ సమ్మిట్' వివాదం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 08:58 AM