Share News

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. రెండు రోజుల్లో 480 మంది మందుబాబుల పట్టివేత

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:06 PM

‘అరైవ్-అలైవ్’ అంటూ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. హైదరాబాద్ నగరవాసులు మాత్రం తమ పద్ధతి మార్చుకోవడం లేదు. కేవలం రెండు రోజులపాటు చేపట్టిన తనిఖీల్లోనే 480 మందికి పైగా వాహనదారులు అరెస్ట్ అయ్యారు.

హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు.. రెండు రోజుల్లో 480 మంది మందుబాబుల పట్టివేత
drunk drive case 480 arrested

హైదరాబాద్, అక్టోబర్ 11: మద్యం మత్తులో వాహనాలు డ్రైవ్ చేయొద్దంటూ అటు ప్రభుత్వం.. ఇటు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. ఆశించిన రీతిలో ఫలితాలు సాధించట్లేదని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.


డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జీరో టాలరెన్స్ లక్ష్యంగా.. నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో 480 మందికి పైగా వాహనదారులు మద్యంమత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. వీరిలో 411 మంది ద్విచక్ర వాహనదారులే ఉండడం గమనార్హం. అరెస్టయిన వారిలో అత్యధికంగా 30 మంది ఆటో డ్రైవర్లు, 38 మంది కార్ డ్రైవర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో బీఏసీ పాయింట్లు 300 దాటిన వారు నలుగురు పట్టుపడ్డారని.. దీన్ని బట్టి ప్రమాదస్థాయిని అర్థం చేసుకోవచ్చని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు. కాగా.. బీఏసీ 30 పాయింట్లు దాటితే.. భారీ జరిమానా విధించడం, లైసెన్స్ రద్దు చేయడం, వాహనాన్ని సీజ్ చేయడం లేదా జైలు శిక్ష విధించడం లాంటి కఠినమైన శిక్షలు వేస్తారని వారు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...

అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 05:32 PM