Share News

హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.1.17 కోట్లు కాజేత

ABN , Publish Date - Oct 25 , 2026 | 08:39 AM

డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ విశ్రాంత ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 1.17 కోట్లు కాజేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని న్యూ మెట్టుగూడలో చోటుచేసుకుంది.

హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.1.17 కోట్లు కాజేత
digital arrest scam in hyderabad

హైదరాబాద్, అక్టోబర్ 25: నగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి విజృంభించారు. ఇటీవలే రిటైర్డ్ అయిన ఓ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసానికి పాల్పడ్డారు. డిజిటల్ అరెస్ట్ చేశామంటూ బెదిరించి రూ. 1.17 కోట్లను కొల్లగొట్టారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..


హైదరాబాద్ నగరంలోని న్యూమెట్టుగూడకు చెందిన 71 ఏళ్ల ఆగ్నేస్ ఫ్రాన్సిస్.. ఈసీఐఎల్‌లో సీనియర్ పర్చేజ్ ఆఫీసర్‌గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందారు. ఈ నేపథ్యంలో గత నెల(సెప్టెంబర్) 9వ తేదీన పోలీస్ అధికారినంటూ ఓ వ్యక్తి ఫ్రాన్సిస్‌కు ఫోన్ చేశాడు. తనను తాను పంచవటి ఠాణా ఎస్సై సంజయ్‌గా పరిచయం చేసుకోవడం, యూనిఫాంలో కనిపించడంతో ఫ్రాన్సిస్ అతడిని నిజమైన పోలీస్ అధికారిగా భావించారు. అనంతరం.. నిందితుడు వీడియో కాల్‌లో మరోవ్యక్తిని.. ఎన్ఐఏ అధికారిగా ఫ్రాన్సిస్‌కు పరిచయం చేశాడు. ఇద్దరు నిందితులు కలిసి ఫ్రాన్సిస్‌ను బెదిరించారు.


మనీలాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామంటూ ఫ్రాన్సిస్‌ను నిందితులు భయపెట్టారు. ఈడీ ఆదేశాలంటూ నకిలీ పత్రాలు చూపించి.. డిజిటల్ అరెస్ట్ చేశామన్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లకూడదని ఆదేశించారు. ఆడిట్ వెరిఫికేషన్ పేరుతో బ్యాంకు నగదు బదిలీ చేయాలంటూ ఫ్రాన్సిస్‌పై ఒత్తిడి తెచ్చారు. కుటుంబానికి హాని జరుగుతుందనే భయంతో ఫ్రాన్సిస్ నగదు బదిలీ చేశారు. బంగారు నగలు సైతం తాకట్టు పెట్టి సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు పలు విడతల్లో రూ. 1.17 కోట్లు బదిలీ చేశారు. అనంతరం మోసపోయానని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు


ఈ వార్తలు కూడా చదవండి:

ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!

హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్‌ ధర 2 లక్షలు

రైతుపై గజ్వేల్‌ ఎస్సై దాడి ?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 08:45 AM