Share News

రైతుపై గజ్వేల్‌ ఎస్సై దాడి ?

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:30 AM

ట్రాన్స్‌ఫార్మర్‌ విషయంలో అన్నదమ్ముల మధ్య రేగిన గొడవ పోలీసుస్టేషన్‌కు చేరగా.. రైతులైన ఆ అన్నదమ్ముల్లో ఒకరిపై ఎస్సై చేయిచేసుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది.

రైతుపై గజ్వేల్‌ ఎస్సై దాడి ?
Gajwel Farmer Attack Case

  • ట్రాన్స్‌ఫార్మర్‌ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ

  • ఎస్సై కొట్టడంతో రవి అనే రైతుకు గాయం, రక్తస్రావం

గజ్వేల్‌, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌ఫార్మర్‌ విషయంలో అన్నదమ్ముల మధ్య రేగిన గొడవ పోలీసుస్టేషన్‌కు చేరగా.. రైతులైన ఆ అన్నదమ్ముల్లో ఒకరిపై ఎస్సై చేయిచేసుకోవడం తీవ్ర వివాదాస్పదమైంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం గిరిపల్లికి చెందిన బీమారి రవి అనే రైతుకు ఆయన అన్నదమ్ములకు మధ్య ట్రాన్స్‌ఫార్మర్‌ విషయంలో గొడవ జరిగింది. ఈ విషయం శుక్రవారం రాత్రి గజ్వేల్‌ పోలీ స్‌స్టేషన్‌కు చేరింది. దీంతో ఎస్సై మల్లారెడ్డి.. రవి, ఆయన అన్నదమ్ములను స్టేషన్‌కి పిలిచి మాట్లాడారు.


ఈ క్రమంలో రవి కొంత ఆవేశంగా మాట్లాడగా.. కోపోద్రిక్తుడైన ఎస్సై.. రవి చెంపపై కొట్టారు. ఆ దెబ్బకు రవి తల గొడకు తగిలి తల నుంచి రక్తస్రావమైంది. ఈ విషయం తెలిసి గిరిపిల్లికి చెందిన కొందరు గజ్వేల్‌ పీఎస్‌కు వచ్చి ఆందోళనకు దిగారు. స్టేషన్‌కు చేరుకున్న ఎస్‌హెచ్‌ఓ, ఏసీపీలు గాయపడ్డ రవిని ఆస్పత్రికి తరలించారు. ఎస్సై మల్లారెడ్డిని సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ సిద్దిపేట సీపీ రేష్మిపెరుమాళ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

జీసీసీని ముంచిన వాళ్లను శిక్షించాలి!

హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్‌ ధర 2 లక్షలు

బీఆర్‌ఎస్‌ నేతలకు బుర్ర లేదు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 05:30 AM