Share News

బీఆర్‌ఎస్‌ నేతలకు బుర్ర లేదు

ABN , Publish Date - Oct 25 , 2026 | 05:03 AM

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు బుర్రలేని, హేతుబద్ధత లేని విమర్శలు చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ నేతలకు బుర్ర లేదు
Uttam Kumar Reddy

  • కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణపై వారివి మతిలేని విమర్శలు: ఉత్తమ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు బుర్రలేని, హేతుబద్ధత లేని విమర్శలు చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్న వారు.. పేర్లు మార్చుకొని గోబెల్స్‌ అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. శనివారం సచివాలయంలో కార్మికశాఖ మంత్రి జి.వివేక్‌, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, గ్యాదరి బాలమల్లు, పటోళ్ల సంజీవ్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు దించితే తప్ప కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి నీటిని పంపింగ్‌ చేయలే మని తెలిపారు. మేడిగడ్డలో కుంగిన ఏడో బ్లాకు పునరుద్ధరించకుండా.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీకు మరమ్మతులు చేయకుండా గేట్లు దించలేమని చెప్పారు.


ఈ బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎస్ఏ) సిఫారసు చేసిందన్నారు. రాజకీయాలకు ఆతీతంగా బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేపడుతుంటే బీఆర్‌ఎస్‌ నేతలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో రూ.1.80 లక్షల కోట్లను నీటిపారుదలశాఖపై వెచ్చించినప్పటికీ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఈ రోజు పడుతున్న కష్టాలకు బీఆర్‌ఎస్‌ పార్టీయే కారణమని విమర్శించారు.


అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడమే తప్పుడు నిర్ణయమని, అప్పట్లో రూ.38 వేల కోట్లు వెచ్చించి ఉంటే ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం కింద తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం పూర్తి కావడమే కాకుండా 16.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని తెలిపారు. కమీషన్ల కక్కుర్తితోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ కట్టింది... కుంగింది కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే బీఆర్‌ఎస్‌ నేతలు సంతోషిస్తున్నారని ఆరోపించారు.


మంత్రి పదవిని పీకినా సిగ్గు రాలేదా?

ఆరు నెలలు అవకాశం ఇస్తే కాళేశ్వరం బ్యారేజీలను మరమ్మతులు చేసి చూపిస్తానంటూ హరీశ్‌రావు విసిరిన సవాలుపై మంత్రి స్పందించారు. నీటిపారుదలశాఖ మంత్రిగా పనికిరారని నాడు కేసీఆర్‌ మంత్రి పదవి నుంచి పీకేశారని, అయినా సిగ్గురాలేదా? అని మండిపడ్డారు. బ్యారేజీలు డిజైన్‌ చేసినప్పుడు షీట్‌పైల్స్‌ వినియోగించాలని ఉండగా... సీకెంట్‌ పైల్స్‌ వాడేందుకు అనుమతినిచ్చింది హరీశ్‌రావేనని, ఏ కమీషన్ల కక్కుర్తితో ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. వారు కట్టిన బ్యారేజీలు విఫలమైనప్పటికీ సిగ్గు లేకుండా బ్యారేజీల వద్దకు పోతున్నారని మండిపడ్డారు. మంత్రి వివేక్‌ మాట్లాడుతూ..ప్రాణహిత-చేవెళ్ల పథకంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టి ఉంటే గ్రావిటీతో నీరు అందేదని, అలా కాకుండా 100 కిమీల కిందికి వెళ్లి పంపింగ్‌ చేసేలా కేసీఆర్‌ తుగ్లక్‌ నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టును తెరమీదికి తెచ్చారని విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

2027 జూన్‌ నాటికి కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతులు పూర్తి

హైదరాబాద్‌కు కాళేశ్వరం నీళ్లివ్వకుంటే సీఎం ఇంటిని ముట్టడిస్తాం

ఇన్‌స్పెక్టర్‌కు 6 నెలలు టార్చర్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 05:03 AM