Share News

పక్కాప్లాన్‌తో ప్రశాంతంగా గణపతుల నిమజ్జన ప్రక్రియ: సీపీ సజ్జనార్

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:28 PM

గణనాథుల విగ్రహాల నిమజ్జనం ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. నిమజ్జనం ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు.

పక్కాప్లాన్‌తో ప్రశాంతంగా గణపతుల నిమజ్జన ప్రక్రియ: సీపీ సజ్జనార్
Hyderabad CP Sajjanar

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (ఆంధ్రజ్యోతి): గణనాథుల విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) వ్యాఖ్యానించారు. నిమజ్జనం ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. మరో గంటలో నిమజ్జనం ప్రక్రియ పూర్తి అవుతోందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో సజ్జనార్ మాట్లాడారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, బషీర్‌భాగ్ ఫ్లై ఓవర్లను ఇప్పటికే సామాన్య వాహనదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు.


అందువల్లే నిమజ్జన ప్రక్రియ ఆలస్యం..

ఈసారి టస్కర్లు, లారీలు అక్కడక్కడా బ్రేక్ డౌన్ అయ్యాయని సీపీ సజ్జనార్ వివరించారు. గణేశ్ విగ్రహాలు మండపాల నుంచి ఆలస్యంగా బయలుదేరాయని చెప్పుకొచ్చారు. అందువల్లే నిమజ్జన ప్రక్రియ ఆలస్యం అవుతోందని అన్నారు. ప్రస్తుతం నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని చెప్పారు. మరో 150 వినాయకుల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని భావిస్తున్నామని అన్నారు. బషీర్‌భాగ్ లిబర్టీ వద్ద ట్రాఫిక్ సమస్యను గుర్తించామని చెప్పారు. తమ సిబ్బంది ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారని వెల్లడించారు.


గత రెండు నెలల నుంచి ఓ ప్లాన్‌తో పనిచేశాం..

ఈరోజు ట్యాంక్‌బండ్ దగ్గర వెహికల్ బ్రేక్ డౌన్ అయిందని సజ్జనార్ చెప్పారు. గత రెండు నెలల నుంచి ఓ ప్లాన్‌తో పోలీసులు నిమజ్జన ప్రక్రియం కోసం పనిచేశారని అన్నారు. గణేశ్ ఉత్సవ కమిటీల ఆర్గనైజేషన్‌తో మాట్లాడి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడంతో ప్రశాంతంగా నిమజ్జనం ప్రక్రియ పూర్తి అవుతోందని అన్నారు. లంబోదరుడి నిమజ్జనాలు ప్రశాంతంగా జరగడానికి సహకరించిన హైదరాబాద్ పోలీస్ సిబ్బందిని పేరుపేరునా సీపీ సజ్జనార్ అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు

రూ.39 లక్షలు పలికిన బాలాపూర్ లంబోదరుడి లడ్డూ

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపయ్య

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 12:55 PM