హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ కలకలం
ABN , Publish Date - Nov 18 , 2026 | 09:13 AM
హైదరాబాద్ ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎన్‌జీఆర్‌ఐ వద్ద చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున 5:40 గంటలకు రోడ్డు దాటుతున్న మురళిబాబు (49) అనే వ్యక్తి నుంచి 1.5 తులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌ను దుండగులు లాక్కెళ్లారు.
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): నగరంలోని ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధి ఎన్‌జీఆర్‌ఐ వద్ద చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున 5:40 గంటలకు రోడ్డు దాటుతున్న మురళిబాబు (49) అనే వ్యక్తి నుంచి 1.5 తులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌ను దుండగులు లాక్కెళ్లారు. మొబైల్‌లో మాట్లాడుతూ ఆయన నడుస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ చోరీకి పాల్పడ్డారు. దొంగతనం అనంతరం తార్నాక వైపు స్నాచర్లు పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సమ్మక్క సాగర్ బ్యారేజీ.. ఎన్‌ఓసీ జారీకి ఛత్తీస్‌గఢ్ సీఎం సానుకూలం..!
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మంత్రి శ్రీధర్‌బాబు
సుప్రీంకోర్టుకు చేరిన 'భారత్ సమ్మిట్' వివాదం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News