మీనాక్షి నటరాజన్ వ్యవహారం.. రేవంత్ అనుచరుడే ఆ లీక్ చేశారా..?: హరీశ్‌రావు
ABN , Publish Date - Jun 11 , 2026 | 03:18 PM
మీనాక్షి నటరాజన్‌కే తెలంగాణ కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మధ్యప్రదేశ్ మంత్రికి కాంగ్రెస్ నుంచి లీక్ ఇచ్చింది ఎవరు ..? అని ప్రశ్నించారు. ఈ లీక్‌పై సిట్, జ్యూడిషియరీ విచారణను సీఎం రేవంత్‌రెడ్డి వేస్తారా..? అని నిలదీశారు.
హైదరాబాద్, జూన్11, (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు తెలంగాణ కాంగ్రెస్ వ్యహహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నామినేషన్ దాఖలు చేశారు. దీనిని ఎన్నికల అధికారి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) స్పందించారు. రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ వేసిన నామినేషన్‌ను తిరస్కరించారని తెలిపారు. మీనాక్షి నటరాజన్‌కే తెలంగాణ కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఈరోజు(గురువారం) హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు.
కాంగ్రెస్ నుంచి లీక్ ఇచ్చింది ఎవరు..?
తెలంగాణ నుంచే తమకు మీనాక్షి నటరాజన్ గురించిన సమాచారం వచ్చిందని మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రినే చెప్పారని హరీశ్‌రావు ప్రస్తావించారు. మధ్యప్రదేశ్ మంత్రికి కాంగ్రెస్ నుంచి లీక్ ఇచ్చింది ఎవరు..? అని ప్రశ్నించారు. ఈ లీక్‌పై సిట్, జ్యూడిషియరీ విచారణను సీఎం రేవంత్‌రెడ్డి వేస్తారా..? అని నిలదీశారు. సీఎం చెప్పిన వ్యక్తికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వలేదనే కారణంతోనే ఆ వ్యక్తే.. మధ్యప్రదేశ్ మంత్రికి సమాచారం అందించారని ఆరోపించారు. సీఎం అనుచరుడే దీని వెనుక ఉన్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి రూ.100 కోట్లతో తన నివాసం సమీపంలో బోధి పెవిలియన్ పేరుతో నివాసం ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఇంటి నిర్మాణం కోసం పదుల సార్లు సీఎం అక్కడికి వెళ్లారని ప్రస్తావించారు.
వందల కోట్లు ఖర్చు పెడతారా..?
రక్షణ కోసం ఇనుప కంచెలకి రూ.17 కోట్లు.. ఫుట్‌బాల్ ఆడటానికి రూ.10కోట్లు కేటాయించారని హరీశ్‌రావు ఆక్షేపించారు. కౌన్సిల్‌లో సీఎం ఛాంబర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించని ఈ సీఎంకి ఇన్ని క్యాంపు కార్యాలయాలు ఎందుకు.? అని ప్రశ్నించారు. ఎందుకు ఇంత ప్రజాధనం వృథా చేస్తున్నారు.? అని మండిపడ్డారు. రూ.7 కోట్లతో జీవో ఇచ్చారని.. ఇప్పటికే రూ.70 కోట్లపైన ఖర్చు చేశారని తెలిపారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి డబ్బులు లేవు కానీ సీఎం సోకుల కోసం రూ. వందల కోట్లు ఖర్చు పెడతారా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు: సీఎం రేవంత్‌రెడ్డి
కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి: ప్రధాని మోదీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News