హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Nov 14 , 2026 | 08:45 AM
హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లో ఓ పెయింటింగ్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్, నవంబరు 1 4(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లో ఓ పెయింటింగ్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇవాళ (శనివారం) ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి, పటాన్‌చెరువు ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రెండు ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిప్రమాదంతో ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిసెంబర్ 9న సోనియాగాంధీ సినిమాను ప్రారంభిస్తాం: జగ్గారెడ్డి
అండాల అక్రమ సేకరణ కేసు.. నిందితుల ఆర్థిక లావాదేవీలు, నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
ఇరిగేషన్ శాఖ డీఈఈ లక్ష్యంగా ఏసీబీ సోదాలు..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News