నార్సింగిలో అగ్నిప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:45 PM
రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని పసిఫికా హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోని బ్లాక్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
రంగారెడ్డి జిల్లా, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని పసిఫికా హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్‌మెంట్‌లోని బ్లాక్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు అగ్నిప్రమాదానికి కారణాలు ఏమిటి?, ఆస్తి నష్టం ఎంత జరిగింది?, ఎవరైనా గాయపడ్డారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
నీళ్ల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం: కేటీఆర్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కారుకు ప్రమాదం..
Read Latest Telangana News And AP NewsAnd National News
And Telugu News