Share News

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు.. విచారణకు నటి నిధి అగర్వాల్‌

ABN , Publish Date - Aug 19 , 2026 | 08:54 AM

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో నటి నిధి అగర్వాల్‌కి ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఈరోజు( బుధవారం) ఈడీ ఆఫీస్‌లో విచారణకు ఆమె హాజరుకానున్నారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు.. విచారణకు నటి నిధి అగర్వాల్‌
Nidhhi Agerwal

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటి నిధి అగర్వాల్‌కి (Nidhhi Agerwal) ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఈరోజు (బుధవారం) ఈడీ కార్యాలయంలో విచారణకు ఆమె హాజరుకానున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రచారం చేసినట్లు నిధి అగర్వాల్‌‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


ఇవాళ ఆమె స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నారు. బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రచారంలో సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాత్రపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. మియాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త ఫణీంద్ర శర్మ ఫిర్యాదు ఆధారంగా ఈడీ అధికారులు ఈ కేసు నమోదు చేశారు.


సెలబ్రిటీలు ప్రకటనల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రమోట్ చేశారని, తద్వారా ప్రజలను అందులో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారని తన ఫిర్యాదులో ఫణీంద్ర శర్మ పేర్కొన్నారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో నటులు రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రణీత, అనన్య నాగళ్ల పేర్లతో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేర్లను ఈడీ అధికారులు చేర్చారు.


వార్తలు కూడా చదవండి...

హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్‌ సర్కార్‌కు కవిత వార్నింగ్

కేబీఆర్ చుట్టూ వన్ వే.. వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 10:08 AM