Share News

ఎల్‌నినోను కూడా రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్.. దానం నాగేందర్ విమర్శలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 01:03 PM

ఎల్‌నినో రాష్ట్ర సమస్య కాదని, ప్రపంచమంతా ఈ విపత్తు ప్రభావంతో అతలాకుతలం అవుతోందని ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ విపత్తులను కూడా రాజకీయం చేస్తోందని ఎమ్మెల్యే మండిపడ్డారు.

ఎల్‌నినోను కూడా రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్.. దానం నాగేందర్ విమర్శలు
danam nagender criticised brs

హైదరాబాద్, అక్టోబర్ 25: ఎల్‌నినో లాంటి విపత్తులను బీఆర్ఎస్ రాజకీయాలకు వాడుకుంటోందని ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. ఈ మేరకు ఎల్‌నినో నేపథ్యంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి ప్రస్తావించారు. దానితోపాటు.. ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీహార్, బెంగాల్, యూపీ రాష్ట్రాలలో ఓట్లను తొలగించడం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని దానం ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పిలుపు మేరకు బీజేపీకి వ్యతిరేకంగా నవంబర్ 1న ఢిల్లోలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించే మెగా ర్యాలీలో పాల్గొనాలని కోరారు.


‘రాహుల్ గాంధీ పిలుపు మేరకు దేశంలోని ప్రతి ఒక్కరూ ‘ఛలో ఢిల్లీ’కి రావాలి. ఎల్‌నినో విపత్తు ప్రభావంతో ప్రపంచం అతలాకుతలం అవుతుంటే..బీఆర్ఎస్ నాయకులు.. జాలీట్రిప్‌లో భాగంగా మేడిగడ్డ పర్యటనకు వెళ్లారు. విపత్తుపై కూడా బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. హైదరాబాద్ నీటి సమస్య తీర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే ప్రయత్నాలు చేశాయి. గోదావరి నది, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కోసం 10 టీఎంసీల నీటిని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. లక్ష కోట్లు ఖర్చు పెట్టి గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తే అది కూలిపోయింది. హైదరాబాద్ నీటి అవసరాల కోసం ఇప్పటివరకు మేడిగడ్డ నుంచి ఒక్క టీఎంసీ నీరు కూడా రాలేదు. హైదరాబాద్ భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో 2027 జనవరి నాటికి హైదరాబాద్‌కు మరో 5 టీఎంసీల నీరు రాబోతుంది’ అని ఎమ్మెల్యే దానం వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పెట్టుబడులకు రెట్టింపు లాభాలు

రోడ్లు వేయరు.. రిపేరు చేయరు

పండుగ వేళ షాపింగ్‌ వెలవెల

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 01:05 PM