భాగ్యనగర వాసులకు అలర్ట్.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Oct 26 , 2026 | 03:05 PM
సైబరాబాద్ IIIT జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఆంక్షలు పొడిగించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మరో 3 నెలల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్ IIIT జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఆంక్షలు పొడిగించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మరో 3 నెలల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. రేపు (మంగళవారం) నుంచి DLF గేట్ నంబర్- 1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు రహదారిని మూసివేస్తున్నట్లు వెల్లడించారు. రాడిసన్ హోటల్ నుంచి IIIT జంక్షన్ వెళ్లే వాహనాలు DLF గేట్ నంబర్- 1 దాటి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పుకొచ్చారు.
వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ నుంచి కుడివైపు తిరిగి ఇందిరానగర్ మీదుగా IIIT జంక్షన్‌కు అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. లింగంపల్లి నుంచి DLF వైపు వెళ్లే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద మళ్లిస్తున్నట్లు చెప్పారు. వాహనదారులు ప్రత్యామ్నాయంగా IIIT జంక్షన్ - గచ్చిబౌలి జంక్షన్ - రాడిసన్ జంక్షన్ మీదుగా DLF చేరుకోవచ్చని సూచించారు. TCS ఉద్యోగులు తమ నాన్-SEZ (CMC) గేట్ ద్వారా యథావిధిగా రాకపోకలు సాగించవచ్చని పేర్కొన్నారు. ప్రయాణికులు ముందస్తుగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణిని మరింత బలోపేతం చేస్తాం: భట్టి విక్రమార్క
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విదేశాల్లోనూ ఆదరణ పెరుగుతోంది: ఎంపీ రఘునందన్
ఎల్‌నినో ప్రభావంతో ఎండలు 50 డిగ్రీలకు చేరే అవకాశం: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News