Share News

సింగరేణిని మరింత బలోపేతం చేస్తాం: భట్టి విక్రమార్క

ABN , Publish Date - Oct 25 , 2026 | 08:52 PM

సింగరేణిని మరింత బలోపేతం చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సింగరేణి అభివృద్ధి, సంస్థను మరింత బలోపేతం చేసే అంశాలపై తాము ప్రత్యేకంగా దృష్టిసారించామని పేర్కొన్నారు.

సింగరేణిని మరింత బలోపేతం చేస్తాం: భట్టి విక్రమార్క
Telangana Deputy CM Bhatti Vikramarka

హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): సింగరేణిని మరింత బలోపేతం చేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Telangana Deputy CM Bhatti Vikramarka) వ్యాఖ్యానించారు. సింగరేణి అభివృద్ధి, సంస్థను మరింత బలోపేతం చేసే అంశాలపై తాము ప్రత్యేకంగా దృష్టిసారించామని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో సింగరేణి జనరల్ మేనేజర్లతో భట్టి విక్రమార్క ఈరోజు (ఆదివారం) ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి సీఎండీ డా. బుద్ధప్రకాష్ జ్యోతి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. సింగరేణిలోని మొత్తం 66 మంది జనరల్ మేనేజర్లతో ఈ సంస్థ పనితీరుపై ప్రత్యక్షంగా భట్టి విక్రమార్క చర్చించారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణి సాధించిన ప్రగతిని అధికారులు.. భట్టి విక్రమార్కకు వివరించారు. జనరల్ మేనేజర్ల విధులు, బాధ్యతలు, క్షేత్రస్థాయి పనితీరుపై ఉప ముఖ్యమంత్రి ఆరా తీశారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు, సాధించిన ఉత్పత్తిపై అధికారులతో సమీక్షించారు. బొగ్గు రవాణా, రేకుల లభ్యత, డిస్పాచ్‌ వివరాల గురించి ఆయన మాట్లాడారు. ఓపెన్‌కాస్ట్‌, భూగర్భ గనుల్లో ఉత్పత్తి పరిస్థితులపై సమీక్షించారు. బొగ్గు ఉత్పత్తి పెంపు, రవాణా వేగవంతం, లక్ష్యాల సాధనపై అధికారులతో చర్చించారు. సింగరేణి భవిష్యత్ విస్తరణ, కొత్త గనుల అభివృద్ధి ప్రణాళికలపై సమాలోచనలు చేశారు. సంస్థ ఉత్పాదకత, సామర్థ్యం పెంపు, కార్యాచరణ మెరుగుదలపై భట్టి విక్రమార్క.. అధికారులకు దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క

ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 09:03 PM