గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
ABN , Publish Date - Oct 24 , 2026 | 07:08 PM
గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. శనివారం టీజీఎల్ఐపీసీ సమీక్షలో లెదర్ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ (CFC) ఏర్పాటు చేస్తున్నామని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు (Telangana Minister Sridhar Babu) వ్యాఖ్యానించారు. ఈరోజు (శనివారం) టీజీఎల్ఐపీసీ సమీక్షలో లెదర్ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిజైనింగ్ నుంచి బ్రాండింగ్ వరకు ఆర్టిజన్లకు పూర్తిగా మార్గనిర్దేశం చేశారు. లెదర్ ఉత్పత్తులకు వాల్యూ యాడెడ్ చేసి మార్కెటింగ్‌కు సహకారం కల్పిస్తున్నామని వెల్లడించారు.
యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
రుక్మాపూర్‌లో పర్యావరణహిత చర్మశుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 1,000 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎస్సీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జమ్మికుంట, ఆర్మూర్‌లో ప్లగ్ అండ్ ప్లే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో లిడ్ క్యాప్‌కు కేటాయించిన భూములపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు తెచ్చాం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క
క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే లక్ష్యం: మంత్రి పొంగులేటి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News