Share News

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విదేశాల్లోనూ ఆదరణ పెరుగుతోంది: ఎంపీ రఘునందన్

ABN , Publish Date - Oct 25 , 2026 | 02:49 PM

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విదేశాల్లోనూ ఆదరణ పెరుగుతోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. అమెరికాలోనూ అయ్యప్ప భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

 భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విదేశాల్లోనూ ఆదరణ పెరుగుతోంది:  ఎంపీ రఘునందన్
BJP MP Raghunandan Rao

సిద్దిపేట జిల్లా, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై విదేశాల్లోనూ ఆదరణ పెరుగుతోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (BJP MP Raghunandan Rao) వ్యాఖ్యానించారు. అమెరికాలోనూ అయ్యప్ప భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని పత్రికల్లో కథనాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) సిద్దిపేటలో ఘనంగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. కొండ మల్లయ్య గార్డెన్‌లో బీజేపీ సీనియర్ నేత దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందన్ రావు పాల్గొని, మాట్లాడారు.


భారతదేశం అంటేనే గొప్ప సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. పార్టీలు, కులమతాలకు అతీతంగా అందరూ ఒక్కచోట చేరడం సంతోషకరమని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా టైర్‌-2 నగరాల్లోనూ అలయ్ బలయ్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా కలిసి మెలిసి ఉండటమే అలయ్ బలయ్ స్ఫూర్తి అని చెప్పారు. ఇస్లామిక్ దేశాలైన గల్ఫ్ దేశాల్లోనూ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.


దేశాలు మారినా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అభిమానం తగ్గడం లేదని ఎంపీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి విస్తరిస్తుండటం మనకు గర్వకారణమని అన్నారు. కుల, మత భేదాలు పక్కనపెట్టి ప్రజల మధ్య ఆత్మీయతను పెంచే కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గచ్చిబౌలిలో 3.5 ఎకరాల్లో లెదర్ కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు

నా చిన్నతనంలో అన్యాయాలను చూడలేకే నక్సలైట్ అయ్యా: మంత్రి సీతక్క

ఆ పరీక్షను వాయిదా వేయాలి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 25 , 2026 | 03:11 PM