సైబరాబాద్‌లో త్వరలో వన్ వే ట్రాఫిక్ విధానం
ABN , Publish Date - Oct 30 , 2026 | 03:44 PM
సైబరాబాద్‌లో త్వరలో వన్ వే ట్రాఫిక్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. కేబీఆర్ పార్క్ తరహాలో వన్ వే ట్రాఫిక్ విధానం పెట్టాలని నిర్ణయించింది.
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌లో త్వరలో వన్ వే ట్రాఫిక్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. కేబీఆర్ పార్క్ తరహాలో వన్ వే ట్రాఫిక్ విధానం పెట్టాలని నిర్ణయించింది. ఐకియా, మైండ్ స్పేస్, రహేజా, కేబుల్ బ్రిడ్జి, శిల్పారామం తదితర ప్రాంతాల్లో వన్ వే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల ట్రయల్ రన్ తర్వాత వన్ వే విధానం అమలు చేయనుంది. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి మూడు రోజులపాటు ఎక్స్‌పో ఏర్పాటు చేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి ప్రకటించారు.
వన్ వే పై స్టడీ చేస్తున్నాం: సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి
సైబరాబాద్ పరిధిలో భారీ ట్రాఫిక్ జామ్ ఉంటుందని సైబరాబాద్ సీపీ రమేశ్ రెడ్డి తెలిపారు. వన్ వేపై ఆలోచన చేస్తున్నామని.. దీనిపై ఇప్పటికే స్టడీ చేశామని వెల్లడించారు. అందరికీ వన్ వేపై అవగాహన కల్పించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ట్రయల్ రన్ నిర్వహించి అప్పుడు వన్ వే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 76 జంక్షన్లు, కమర్షియల్ భవన్‌లకు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లుపై కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించటానికి వన్ వే ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు.
సైబరాబాద్ మూవ్స్ పేరుతో బృహత్తర కార్యక్రమం..
ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికి సైబరాబాద్ మూవ్స్ పేరుతో బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని సీపీ రమేశ్ రెడ్డి వెల్లడించారు. సవాళ్లు ఏమున్నాయో చూసి పరిష్కరించుకోవడానికి వేదికలాగా సైబరాబాద్ మూవీస్ చర్చా వేదిక ఉంటుందని తెలిపారు. 26,27, 28 తేదీల్లో టీ హబ్‌లో ఈ చర్చా వేదిక ఉంటుందని వివరించారు. వివిధ రంగాలకు సంబంధించిన వారు, విద్యార్థులు ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులకు మున్సిపల్ సిబ్బందికి వివిధ అంశాలపై డబ్ల్యూఆర్ఐ సహకారంతో వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.
ఎవరికి ఇబ్బంది కలగకుండా వన్ వే..
అహ్మదాబాద్ బెంగళూరులో కూడా ఇలాంటి చర్చ వేదికలు జరిగాయని సీపీ రమేశ్ రెడ్డి ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి బోగోట మేయర్, ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ చీఫ్ టెక్నికల్ అధికారి వస్తున్నారని తెలిపారు. ఎంతో విశాలమైన రోడ్లు ఉన్నా హైదరాబాద్‌లో నిత్యం ట్రాఫిక్ జామ్ ఉంటుందని వివరించారు. ట్రాఫిక్ జామ్ సమస్యలపై అధ్యయనం చేస్తున్నామని అన్నారు. తమ దగ్గర ఉన్న డేటాను ఇవాళ సిములేషన్ కూడా చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ ఆగకుండా నిరంతరంగా వాహనాలు కదిలే విధంగా వన్ వే అధ్యయనం చేస్తున్నామని అన్నారు. వన్ వే పై ఇప్పటికే సంస్థలు, అన్ని వర్గాలతో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. చర్చలు అయ్యాక సివిల్ వర్క్స్ పూర్తి చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా వన్ వే లాంచ్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. ముందుగా ట్రయల్ నిర్వహించి అందరికీ ముందుగా అవగాహన కల్పించిన తర్వాతే అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం వన్ వేపై అధ్యయనం కొనసాగుతుందని సీపీ రమేశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. పూర్తి భద్రత కల్పిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
కరవును చంద్రబాబు బాగా మేనేజ్ చేశారు.. కేటీఆర్ ప్రశంసలు
ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: భట్టి విక్రమార్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News