Share News

రంగారెడ్డి జిల్లాలో ఆర్జీసీ బస్సు బీభత్సం.. బైకర్‌కు తీవ్రగాయాలు

ABN , Publish Date - Oct 11 , 2026 | 03:19 PM

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రహదారిపై నిర్లక్ష్యంగా బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.

రంగారెడ్డి జిల్లాలో ఆర్జీసీ బస్సు బీభత్సం.. బైకర్‌కు తీవ్రగాయాలు
rtc bus hits bike in rangareddy district

రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 11: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రహదారిపై నిర్లక్ష్యంగా బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడు. అతివేగం అదుపుతప్పి చివరికి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి ప్రాణాపాయస్థితిలో చికిత్స పొందుతున్నారు.


పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని షాబాద్ మండలం నాగర్‌గూడ చౌరస్తాలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. షాద్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నాగర్‌గూడ చౌరస్తాలో అతివేగంగా దూసుకెళ్తూ.. వాహనదారులను భయబ్రాంతుకు గురి చేసింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడుపుతూ.. చివరికి ఓ బైకర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాధితుడి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, వాహనదారులు బాధితుడిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.


సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో బాధితుడు ఎట్ల ఎర్రవల్లికి చెందిన మంత్రాల నరసింహులుగా పోలీసులు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. బస్సు డ్రైవర్ల నిర్లక్ష్య వైఖరి, ఓవర్‌ స్పీడ్‌పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాద్‌నగర్ డిపో అధికారులు తక్షణమే స్పందించి.. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...

అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 03:21 PM