Share News

25, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Nov 24 , 2026 | 07:52 AM

పండుగ సీజన్‌ రద్దీని దృష్టిలో పెట్టుకొని చర్లపల్లి-రక్సౌల్‌ మార్గంలో ఈనెల 25, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

25, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లు
Cherlapalli Raxaul Special Train

  • చర్లపల్లి-రక్సౌల్‌ మధ్య..

హైదరాబాద్‌ సిటీ: పండుగ సీజన్‌ రద్దీని దృష్టిలో పెట్టుకొని చర్లపల్లి-రక్సౌల్‌ మార్గంలో ఈనెల 25, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 05527 ప్రత్యేక రైలు రక్సౌల్‌ నుంచి చర్లపల్లికి బుధవారం సాయంత్రం 4.55 గంటలకు, 05528 రైలు చర్లపల్లి నుంచి రక్సౌల్‌కు శుక్రవారం రాత్రి 10 గంటలకు బయల్దేరుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. మార్గమధ్యంలో ఈ ప్రత్యేకరైళ్లకు ఖాజీపేట్‌, రామగుండం, బలార్ష, వాడ్స, గోండియా తదితర స్టేషన్లలో హాల్ట్‌ ఉంటుందని పేర్కొన్నారు.

city2.2.jpg


city2.3.jpgనేడు సికింద్రాబాద్‌-తిరుపతి వన్‌ వే స్పెషల్‌

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్‌ - తిరుపతి మధ్య వన్‌వే స్పెషల్‌ రైలును నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07099 ప్రత్యేక రైలు మంగళవారం సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి బయల్దేరుతుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. మార్గమధ్యంలో లింగంపల్లి, వికారాబాద్‌, రాయచూర్‌, ఆదోని, గుంతకల్‌, గుత్తి, అనంతపూర్‌, ధర్మవరం, కదిరి, ములకలచెరువు, మదనపల్లి, కలికిరి, పీలేరు, పాకాల స్టేషన్లలో హాల్ట్‌ ఉంటుందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పసిడి ధరల్లో మళ్లీ పెరుగుదల.. నేడు ఎలా ఉన్నాయంటే..

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 07:52 AM