బరిలోకి దిగితే.. ఏకగ్రీవమే!
ABN , Publish Date - Nov 24 , 2026 | 06:39 AM
ఆ కుటుంబంలోని ఎవరైనా సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగితే.. ఏకగ్రీవం కావాల్సిందే! ఏలూరు జిల్లా దెందులూరు మండలం సానిగూడెం పంచాయతీ...
ఆ కుటుంబంలో అందరూ ఏకగ్రీవ సర్పంచ్‌లే...
దెందులూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఆ కుటుంబంలోని ఎవరైనా సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగితే.. ఏకగ్రీవం కావాల్సిందే! ఏలూరు జిల్లా దెందులూరు మండలం సానిగూడెం పంచాయతీ సర్పంచ్‌గా టీడీపీ నేత యలమర్తి శ్రీనుబాబు సతీమణి పద్మజ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలోనూ ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై, సర్పంచ్‌గా పనిచేశారు. పద్మజ మామ రెండు సార్లు, భర్త శ్రీనుబాబు ఒకసారి, పద్మజ రెండు సార్లు ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నికై రికార్డు సృష్టించారు.
ఈ వార్తలనూ చదవండి: