Share News

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:19 AM

కరీంనగర్‌ మెడికల్‌ కాలేజీ, హాస్టల్‌ భవనాల నిర్మాణ పనుల జాప్యంపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కరీంనగర్‌ వైద్య కాలేజీ నిర్మాణంలో జాప్యమేంటి?

  • మార్చికల్లా కళాశాల, హాస్టళ్లు ప్రారంభించాలి: దామోదర

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ మెడికల్‌ కాలేజీ, హాస్టల్‌ భవనాల నిర్మాణ పనుల జాప్యంపై మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెలాఖరుకల్లా బాలికలు, డిసెంబరు చివరికల్లా బాలుర హాస్టళ్లను.. వచ్చే మార్చికల్లా మెడికల్‌ కళాశాల భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.


వివిధ జిల్లా కేంద్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కళాశాలల నిర్మాణాలపై సోమవారం ఆయన సచివాలయంలో సమీక్షించారు. జనగామ మెడికల్‌ కాలేజీ భవనం, క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణంలో పెండింగ్‌ పనులను యుద్ధం ప్రాతిపదికన పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. సిద్దిపేట బోధనాస్పత్రి నిర్మాణ పనులు మార్చికల్లా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. 100 బెడ్ల నుంచి 250 బెడ్లకు అప్‌గ్రేడ్‌ చేసిన హుస్నాబాద్‌ ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

భారత్‌లోని వైవిధ్యం ఇతర దేశాలకు కూడా ఆదర్శం: పుతిన్

Updated Date - Nov 24 , 2026 | 05:19 AM