Share News

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:24 PM

చైనా గూఢచారిణిగా అనుమానాలున్న ఆలిస్ అనే మహిళతో ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ ఎఫైర్‌కు సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది.

ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌ వెనుక చైనా వ్యాపారవేత్త స్కెచ్
Nvidia chip diversion by China Business man

ఇంటర్నెట్ డెస్క్: చైనా గూఢచారిణిగా అనుమానాలున్న ఆలిస్ అనే మహిళతో ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్ ఎఫైర్‌కు సంబంధించి రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. చైనాకు ఎన్విడియా చిప్స్ స్మగ్లింగ్‌లో ఆలిస్ పాత్ర ఉందని ఇప్పటివరకూ ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఆలిస్ తెరముందు వ్యక్తి మాత్రమేనని, తెర వెనుక చైనా వ్యాపారవేత్త ఒకరు ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి.


సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ అనే సంస్థలో ఆలిస్ పనిచేసిన విషయం తెలిసిందే. ఇదే సంస్థలో చైనా వ్యాపారవేత్త లీ మింగ్ కీలకంగా వ్యవహరించారని సమాచారం. ఆయన భారీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని చైనాకు ఎన్విడియా చిప్స్ సరఫరా చేసినట్టు తెలుస్తోంది. లీ మింగ్‌కు మెగాస్పీడ్‌తో పాటు పలు ఇతర సంస్థలతో కూడా సంబంధాలు ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఎన్విడియా ఆధారిత సర్వర్లను సింగ్‌పూర్ నుంచి పక్కదారి పట్టించిన ఆరోపణలతో ఆయనపై కేసు కూడా నమోదైంది. ఎన్విడియా చిప్స్ సింగపూర్‌లోనే ఉంటాయన్న హామీ ఇచ్చి కొనుగులు చేశాక వాటిని మలేషియా నుంచి మరో దేశం మీదుగా చివరకు చైనాకు చేర్చినట్టు సింగపూర్ అధికారులు అప్పట్లో ఆరోపించారు.


ఈ నేపథ్యంలో ప్రస్తుతం మెగాస్పీడ్ కార్యకలాపాలపై యూఎస్‌తో పాటు సింగపూర్, తైవాన్ దేశాలు ప్రభుత్వాలు కూడా దృష్టిపెట్టాయి. ఇక మలేషియాలోని డేటా సెంటర్ల ద్వారా ఎన్విడియా కంప్యూటర్ చిప్స్ సామర్థ్యాలను చైనాకు మెగాస్పీడ్ అందుబాటులో ఉంచినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే, తాము ఎలాంటి తప్పు చేయలేదని మెగాస్పీ్డ్ మొదటి నుంచీ వాదిస్తోంది. ఎగుమతులపై ఆంక్షలకు సంబంధించిన నిబంధనలు పక్కాగా పాటిస్తున్నామని తెలిపింది.


ఈ వార్తలనూ చదవండి:

ట్రంప్‌ను పట్టించుకోని కిమ్.. 60 అణ్వాయుధాలతో అమెరికాకు ఉత్తర కొరియా సవాల్..

డేంజర్.. డేటింగ్ విషయంలో జాగ్రత్త! తనయుడితో మెలానియా ట్రంప్

Updated Date - Nov 22 , 2026 | 07:26 PM