Share News

డేంజర్.. డేటింగ్ విషయంలో జాగ్రత్త! తనయుడితో మెలానియా ట్రంప్

ABN , Publish Date - Nov 22 , 2026 | 04:52 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, దేశ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తమ తనయుడు బారెన్ ట్రంప్‌నకు డేటింగ్ విషయంలో పలు సూచనలు చేశారు.

డేంజర్.. డేటింగ్ విషయంలో జాగ్రత్త! తనయుడితో మెలానియా ట్రంప్
Melania Trump, son Barron Trump

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య, దేశ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తమ తనయుడు బారెన్ ట్రంప్‌నకు డేటింగ్ విషయంలో పలు సూచనలు చేశారు. డేటింగ్ ప్రపంచంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని తనయుడికి సలహా ఇచ్చారు. అయితే, తాను మాత్రం అన్ని వేళలా అండగా ఉంటానని బిడ్డకు భరోసా ఇచ్చారు. బారెన్ ట్రంప్‌నకు ఇచ్చిన సలహాల గురించి మెలానియా ట్రంప్ స్వయంగా ఓ డాక్యూసీరిస్‌లో తాజాగా వెల్లడించారు. ‘బయటి ప్రపంచం ప్రమాదకరం, జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడూ నేను చెబుతూ ఉంటా’ అని మెలానియా ట్రంప్ అన్నారు.


తన బిడ్డతో ఏ విషయంపైనైనా దాపరికాలు లేకుండా మాట్లాడతానని మెలానియా ట్రంప్ చెప్పారు. జీవితంలో సవాళ్లు ఎదుర్కొనే సమయంలో అతడికి అండగా ఉంటానని అన్నారు. ట్రంప్ సంతానంలో చిట్టచివరి వాడైన బారెన్ ట్రంప్ సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే, గతేడాది బారెన్ తన ప్రేయసిని ట్రంప్ టవర్‌కు డేట్‌పై తీసుకెళ్లినట్టు అమెరికా మీడియాలో వార్తలు వైరల్‌గా మారింది. తనకు అడ్డంకులు లేకుండా ఆ రోజు బారెన్ వారి టేబుల్ ఉన్న అంతస్తు మొత్తాన్ని మూసేయించినట్టు కూడాతెలిసింది. అయితే, తన వ్యక్తిగత వ్యవహారాల గురించి బారెన్ ఎప్పుడూ బహిరంగంగా చర్చించలేదు. తను రిలేషన్‌షిప్‌లో ఉన్నడా? లేడా? అనే విషయంపై ఎప్పుడూ బయటపడలేదు. ప్రస్తుతం బారెన్ న్యూయార్క్ యూనివర్సిటీ స్టర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జూనియర్ సంవత్సరంలో ఉన్నాడు.


ఈ వార్తలనూ చదవండి:

హోర్ముజ్‌లో రవాణా పునరుద్ధరించాలి.. జలసంధిలో ఈదుతూ బ్రిటిష్ స్విమ్మర్ వినతి

కెనడాలో కాల్పులు.. భారత సంతతి దంపతుల హత్య

Updated Date - Nov 22 , 2026 | 04:52 PM