Share News

ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌పై చర్యలు తీసుకోవాలి.. కేంద్రానికి బండి సంజయ్ లేఖ

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:38 PM

కేంద్ర జల్‌శక్తి మంత్రికి కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్ బుధవారం లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్డీఎస్ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్‌పై చర్యలు తీసుకోవాలి.. కేంద్రానికి బండి సంజయ్ లేఖ
Bandi Sanjay

హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర జల్‌శక్తి మంత్రికి కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమార్ (Bandi Sanjay Kumar) ఈరోజు (బుధవారం) లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్డీఎస్ఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎం రేవంత్‌‌రెడ్డి కార్యక్రమంలో ఆయన పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈనెల 20వ తేదీన రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్‌రెడ్డి మేడిగడ్డను సందర్శించారని చెప్పుకొచ్చారు.


ఆ కార్యక్రమంలో అనిల్‌ జైన్‌ ఎలా పాల్గొంటారు..? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో బ్యారేజీలకు మరింత నష్టం జరిగితే.. ఎన్డీఎస్ఏపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నిందమోపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కమిటీ సిఫార్సులను నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కేంద్రానికి చెడ్డపేరు తెచ్చేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహించారు. అనిల్‌ జైన్‌పై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బండి సంజయ్‌ కుమార్ సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 22 , 2026 | 05:40 PM