Share News

బీజేపీ ఆఫీస్‌‌పై దాడి.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ధ్వజం

ABN , Publish Date - Aug 31 , 2026 | 04:37 PM

హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయం వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి, కార్యాలయ గేటుకు నల్ల రంగు పూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

బీజేపీ ఆఫీస్‌‌పై దాడి.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ధ్వజం
Bandi Sanjay Kumar

హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయం వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి, ఆ పార్టీ కార్యాలయ గేటుకు నల్ల రంగు పూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తోందా? అని నిలదీశారు. పట్టపగలు బీజేపీ ఆఫీస్‌పై దాడి చేస్తుంటే పోలీసులు తమాషా చూస్తున్నారా? అని ధ్వజమెత్తారు.


కాంగ్రెస్‌కు తొత్తులుగా పోలీసులు పనిచేస్తున్నారా?..

కాంగ్రెస్‌కు తొత్తులుగా పోలీసులు పనిచేస్తున్నారా? అని బండి సంజయ్ మండిపడ్డారు. భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న జాతీయ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రక్షణ కల్పించే బాధ్యత మీకు లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. యూత్ కాంగ్రెస్ నేతలు అరాచకం సృష్టిస్తోంటే అక్కడ పోలీసులెందుకు లేరు? అని నిలదీశారు. పోలీసుల వైఫల్యానికి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఖబడ్దార్ కాంగ్రెస్ నేతల్లారా.... తాము తలుచుకుంటే బయట తిరగలేరని బండి సంజయ్ హెచ్చరించారు.


యూత్ కాంగ్రెస్ నేతల చర్యకు మించి ప్రతి చర్యలు..

ఈ ఘటనకు కారణమైన వారిని అరెస్ట్ చేసి చట్టం ముందు సాయంత్రంలోపు నిలబెట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యూత్ కాంగ్రెస్ నేతల చర్యకు మించి ప్రతి చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. బీజేవైఎం కార్యకర్తలు తలుచుకుంటే యూత్ కాంగ్రెస్ నేతలు బయట తిరగలేరని మందలించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ కార్యాలయాలను బీజేపీ శ్రేణులు దిగ్బంధిస్తారని హెచ్చరించారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


పోలీసు ఉన్నతాధికారులకు బండి సంజయ్ ఫోన్..

యూత్ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్‌పై చేసిన దాడిపై తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు కేంద్రమంత్రి బండి సంజయ్ ఫోన్ చేసి ఆరా తీశారు. బీజేపీ ఆఫీస్ వద్ద ప్రధాని దిష్టిబొమ్మ దగ్దం చేసి, కార్యాలయ గేటుకు నల్ల రంగు పూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పట్టపగలు బీజేపీ ఆఫీస్‌పై దాడి చేస్తుంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులను వివరణ కోరారు. తక్షణమే ఈ ఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

‘టాక్సిక్‌‌’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజాసింగ్

వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 31 , 2026 | 04:59 PM