మంగ్లీ అండ్ కో నుంచి బెదిరింపులు.. అడ్వకేట్ సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 20 , 2026 | 03:10 PM
ప్రముఖ గాయని మంగ్లీ నుంచి తనకు ప్రాణహాని ఉందని అడ్వకేట్ సుబ్బారావు తెలిపారు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు డీజీపీని సోమవారం అడ్వకేట్ కలిశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ గాయని మంగ్లీ (Singer Mangli) నుంచి తనకు ప్రాణహాని ఉందని అడ్వకేట్ సుబ్బారావు (Advocate Subbarao) తెలిపారు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డిని కోరారు. ఈ మేరకు డీజీపీని ఈరోజు(సోమవారం) అడ్వకేట్ కలిశారు. మంగ్లీ అండ్ కో, ఓయూ విద్యార్థులు కొంతమంది తనకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ బెదిరింపులతో మంగ్లీకి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా.. పరోక్షంగా సంబంధం ఉందని చెప్పుకొచ్చారు.
మధు నాయక్ తెలియదు అంటూనే అతన్ని చాలాసార్లు మంగ్లీ కలిసిందని.. ఒక్క ప్రోగ్రామ్స్ కోసమే కాదని తెలిపారు. తాను ఎవరినీ డబ్బులు అడగలేదని.. దానికి తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని వివరించారు. తనను అవమానించినందుకు పంజాగుట్ట సీఐకి నోటీసులు అందాయని వెల్లడించారు. తనకు రక్షణ కలిపిస్తానని డీజీపీ హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. మైక్రోఫైనాన్స్ కేసులో బాధితులకు న్యాయం జరిగే వరకు తాను పోరాడతానని అడ్వకేట్ సుబ్బారావు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..
కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్
33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కిరణ్ కుమార్ రెడ్డి
Read Latest Telangana News And AP News And International News And Telugu News