Share News

ఎల్‌నినో విపత్తుకు ప్రభుత్వమే కారణమనడం దారుణం: విప్ ఆది శ్రీనివాస్

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:26 PM

ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రం కష్టకాలంలో ఉన్న సందర్భంలో.. ప్రభుత్వమే విపత్తుకు కారణమనడం ఎంత వరకు సమంజసనీయం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. విపత్తుకు ప్రభుత్వాన్ని బద్నాం చేయడమంటే.. బాధ్యత నుంచి తప్పించుకోవడమే అవుతుందని తీవ్రంగా స్పందించారు.

ఎల్‌నినో విపత్తుకు ప్రభుత్వమే కారణమనడం దారుణం: విప్ ఆది శ్రీనివాస్
adi srinivas criticizes brs

హైదరాబాద్, నవంబర్ 7: అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇంకెన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శించారు.


‘కరోనా సృష్టికర్త కేసీఆర్ అని మేం అనలేమా?.. ఎబోలా సృష్టికర్త హరీష్ రావు అని అనలేమా?.. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ హరీశ్ రావు. ఆయన కళ్ళు ఉండి కూడా.. గుడ్డివాడిలా వ్యవహరిస్తున్నారు. కరెంట్ డిమాండ్ ఎక్కువగా ఉన్నా.. మేం రైతులకు కరెంట్ ఇస్తున్నాం. మీ హయాంలో కంటే మేమే రైతులను ఎక్కువగా ఆదుకున్నాం. అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు ఊరుకోరు. కాళేశ్వరం కట్టి గోదావరి నీళ్లను తెలంగాణకు ఉపయోగం లేకుండా చేశారు. కృష్ణా నీటిని పక్క రాష్ట్రానికి రాసిచ్చి తెలంగాణకు మరణ శాసనం రాసింది ఎవరు.. కేసీఆర్ కాదా..’ అంటూ విప్ శ్రీనివాస్ నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

దీపావళికి స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌ అమ్మకాల్లో రికార్డులు

చర్లపల్లి-రక్సాల్‌ మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 12:27 PM