Share News

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. చిన్నారిని ఢీకొట్టి..

ABN , Publish Date - May 17 , 2026 | 08:11 AM

హైదరాబాద్‌లోని టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గల్లీలో నిర్లక్ష్యంగా నడిపిన థార్ వాహనం మూడేళ్ల చిన్నారి లతీఫ్‌ను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది.

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. చిన్నారిని ఢీకొట్టి..
Hyderabad Road Accident

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని టప్పాచబుత్ర పోలీసుస్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గల్లీలో నిర్లక్ష్యంగా నడిపిన థార్ వాహనం మూడేళ్ల చిన్నారి లతీఫ్‌ను ఢీకొట్టడంతో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫహద్ అనే యువకుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే థార్ వాహనం నడిపాడు. వేగంగా వచ్చిన వాహనం చిన్నారిని ఢీకొట్టడమే కాకుండా కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు తెలిపారు. చిన్నారి అరుపులు, స్థానికుల కేకలతో డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. ఈ ప్రమాదంలో లతీఫ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.


ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రైజింగ్‌తో త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం: శ్రీధర్‌బాబు

ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి పొంగులేటి ప్రకటన

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 17 , 2026 | 08:18 AM