Share News

అక్టోబరు 4 నుంచి 18 ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:12 AM

దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-నర్సాపూర్‌ మార్గంలో 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

అక్టోబరు 4 నుంచి 18 ప్రత్యేక రైళ్లు
Charlapalli Narsapur special trains

  • చర్లపల్లి-నర్సాపూర్‌ మార్గంలో..

హైదరాబాద్‌ సిటీ: దసరా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-నర్సాపూర్‌ మార్గంలో 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అక్టోబరు 4నుంచి నవంబరు 29 వరకు ప్రతీ ఆదివారం రాత్రి 10 గంటలకు నర్సాపూర్‌ నుంచి 07062 ప్రత్యేక రైలు, అక్టోబరు 5నుంచి నవంబరు 30వరకు ప్రతీ సోమవారం రాత్రి 7.30 గంటలకు చర్లపల్లి నుంచి 07063 ప్రత్యేక రైలు బయల్దేరుతాయని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు.


city6.2.jpgఈరైళ్లకు మార్గమధ్యంలో నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో హాల్ట్‌ ఉంటుందన్నారు.


zxzxx.jpgఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

మహా గణపతి మునిగేలా చర్యలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 11:12 AM