కేపీహెచ్‌బీ-వేవ్‌రాక్ మార్గంలో ప్రత్యేక బస్ లేన్!
ABN , Publish Date - Sep 24 , 2026 | 10:08 AM
ఐటీ ఉద్యోగుల రాకపోకలతో పీక్ అవర్స్‌లో కేపీహెచ్‌బీ-వేవ్‌రాక్ మార్గంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పీక్ అవర్స్‌లో వేగంగా రాకపోకలు
ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు
హైదరాబాద్ సిటీ: ఐటీ ఉద్యోగుల రాకపోకలతో పీక్ అవర్స్‌లో కేపీహెచ్‌బీ-వేవ్‌రాక్ మార్గంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మార్గంలో టీజీఎస్ఆర్టీసీ, ఐటీ కంపెనీల బస్సులకు ప్రత్యేక లేన్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తూ బుధవారం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు. రహదారి సామర్థ్యం, ట్రాఫిక్ ప్రవాహం, ప్రత్యేక బస్ లేన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.
జేఎన్‌టీయూ-బయో డైవర్సిటీపై ప్రత్యేక దృష్టి
ట్రయల్ రన్‌లో కేపీహెచ్‌బీ-వేవ్‌రాక్ మార్గంతో పాటు జేఎన్‌టీయూ-బయోడైవర్సిటీ కారిడార్‌లో పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ రాకపోకలను పరిశీలించారు. ప్రత్యేక బస్ లేన్ ఏర్పాటు వల్ల సాధారణ వాహనాల రాకపోకలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఏ ప్రాంతాల్లో లేన్ కేటాయింపు సాధ్యమవుతుంది? ఎక్కడ మలుపులు, జంక్షన్లు, విలీన మార్గాలు సమస్యగా మారే అవకాశం ఉంది? వంటి అంశాలను కూడా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు.
పరిశీలనలను విశ్లేషించిన అనంతరం ప్రత్యేక బస్‌లేన్ ఏర్పాటుపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. ట్రయల్ రన్‌లో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, డీసీపీ ట్రాఫిక్ శేషాద్రిని రెడ్డి, టీజీఎస్ ఆర్టీసీ ఈడీ శ్రీధర్, ఎస్సీఎస్సీ సీఈఓ నవీద్ ఆలమ్ ఖాన్‌తో పాటు రోడ్డు, నగర ప్రణాళిక నిపుణులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News