పుష్కర ఘాట్లలో నీటి నాణ్యతపై పర్యవేక్షణ
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:45 AM
గోదావరి పుష్కరాలు-2027కు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు తరలివచ్చే అవకాశం ఉన్నందున గోదావరి పుష్కర ఘాట్లలో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య పీసీబీ అధికారులకు సూచించారు.
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలు-2027కు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు తరలివచ్చే అవకాశం ఉన్నందున గోదావరి పుష్కర ఘాట్లలో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి.కృష్ణయ్య పీసీబీ అధికారులకు సూచించారు. బుధవారం ఏపీపీసీబీ కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా పీసీబీ చేపట్టాల్సిన చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. సమగ్ర ప్రణాళిక రూపొందించి ఉభయగోదావరి జిల్లాల్లో గోదావరి పుష్కరఘాట్ల వద్ద నీటి నమూనాలు తీసి, నీటి నాణ్యతకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.