5న మద్యం షాపులకు లాటరీ
ABN , Publish Date - Sep 24 , 2026 | 07:25 AM
మద్యం షాపులకు లాటరీ తేదీని ఎక్సైజ్ శాఖ మార్చింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30న కాకుండా.. అక్టోబరు 3న లాటరీ తీయాలని నిర్ణయించింది.
అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): మద్యం షాపులకు లాటరీ తేదీని ఎక్సైజ్ శాఖ మార్చింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30న కాకుండా.. అక్టోబరు 3న లాటరీ తీయాలని నిర్ణయించింది. షాపుల రెన్యువల్ గడువును పొడిగించినందున దరఖాస్తులు, లాటరీలో మార్పులు చేసింది. రెన్యువల్ కాకుండా మిగిలిపోయిన షాపులకు గురువారం నుంచి అక్టోబరు 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 5న లాటరీ తీసి లైసెన్సీలను ఎంపిక చేస్తారు. అయితే ఒక్కో షాపునకు కనీసం 10 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీయాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. సుమారు 400 షాపులకు కొత్త దరఖాస్తుల కోసం గురువారం గెజిట్ ఇస్తారు. కాగా.. రెన్యువల్ ఆర్‌ఈటీ, లైసెన్స్ ఫీజుల రూపంలో బుధవారం సాయంత్రం వరకు రూ.1,268 కోట్లు వచ్చాయి.