Share News

స్థానిక ఎన్నికల్లో 100 శాతం గెలుపే లక్ష్యం

ABN , Publish Date - Sep 24 , 2026 | 07:40 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం గెలుపే లక్ష్యంగా సమష్టి కార్యాచరణతో ముందుకు సాగాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

స్థానిక ఎన్నికల్లో 100 శాతం గెలుపే లక్ష్యం

అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం గెలుపే లక్ష్యంగా సమష్టి కార్యాచరణతో ముందుకు సాగాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎన్‌డీఏ పార్టీల సమన్వయ సమావేశం జరిగింది. మూడు పార్టీలూ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, మంత్రి సత్యకుమార్‌, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్‌, తమ్మిరెడ్డి శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 07:41 AM