ఏపీలో భారీ వర్షాలు.. 80 ప్రాంతాల్లో 100 మి.మీ.కి పైగా వర్షపాతం..
ABN , Publish Date - Sep 24 , 2026 | 08:36 AM
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి గురువారం ఉదయం 7 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు.
విశాఖ: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో నదులు, చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ మేరకు బుధవారం ఉదయం 8:30 గంటల నుంచి గురువారం ఉదయం 7 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 80 ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు ఆయన తెలిపారు.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం.. అత్యధికంగా విశాఖ రూరల్‌లోని తులసీనగర్‌లో 236 మి.మీ., మధురవాడలో 218 మి.మీ., ఎండాడలో 210 మి.మీ. వర్షపాతం నమోదైంది. సీతమ్మధారలో 205 మి.మీ., కాపులుప్పాడలో 202 మి.మీ., మహారాణిపేటలో 199 మి.మీ. అత్యధిక వర్షపాతం రికార్డైంది. అలాగే, పెందుర్తిలో 179 మి.మీ., బుచ్చిరాజుపాలెంలో 171 మి.మీ., పెదగంట్యాడలో 165 మి.మీ., కొత్తపాలెంలో 163 మి.మీ. వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా కొత్తవలసలో 188 మి.మీ., శ్రీకాకుళం జిల్లా లక్ష్మీనర్సుపేటలో 158 మి.మీ., జలుమూరులో 150 మి.మీ., కాకినాడ రూరల్‌లో 148 మి.మీ., తూర్పుగోదావరి జిల్లా గాడాలలో 146 మి.మీ. వర్షపాతం రికార్డైంది.
పలు జిల్లాల్లో నమోదైన అతిభారీ వర్షాలు
కాకినాడ జిల్లా వేలంగిలో 142 మి.మీ., జగ్గంపేటలో 140 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా చంద్రాలో 133 మి.మీ., కోనసీమ జిల్లా ముమ్మడివరంలో 132 మి.మీ., విజయనగరం జిల్లా ఎల్.కోటలో 131 మి.మీ., కృష్ణా జిల్లా బాపులపాడులో 124 మి.మీ., ఏలూరు జిల్లా ఏదులగూడెంలో 122 మి.మీ., పోలవరం జిల్లా దేవీపట్నంలో 121 మి.మీ. వర్షపాతం రికార్డైంది.
కాగా, గత రాత్రి 11 గంటల నుంచి 1 గంట మధ్య కళింగపట్నం సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన ఆరు గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో అది కదిలిందని, మరో 12 గంటల పాటు దాని ప్రభావం కొనసాగనుందని పేర్కొన్నారు. ఆ తర్వాత 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించారు. తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ ప్రజలు మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
మరోవైపు, నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోనూ అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
డిసెంబరులో తిరుపతి వేదికగా డీజీపీల సమావేశం
పుష్కర ఘాట్లలో నీటి నాణ్యతపై పర్యవేక్షణ