Share News

డిసెంబరులో తిరుపతి వేదికగా డీజీపీల సమావేశం

ABN , Publish Date - Sep 24 , 2026 | 07:37 AM

తిరుపతి జిల్లా ఏర్పే డు సమీపంలోని ఐజర్‌(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) వేదికగా డిసెంబరు మొదటి వారంలో 61వ అఖిల భారత డీజీపీల కాన్ఫరెన్సు జరగనుంది.

డిసెంబరులో తిరుపతి వేదికగా డీజీపీల సమావేశం

తిరుపతి కలెక్టరేట్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా ఏర్పే డు సమీపంలోని ఐజర్‌(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) వేదికగా డిసెంబరు మొదటి వారంలో 61వ అఖిల భారత డీజీపీల కాన్ఫరెన్సు జరగనుంది. ఈ కాన్ఫరెన్సుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, కేంద్ర నిఘా సంస్థల అధిపతులు హాజరవుతున్నారు. అలాగే దేశంలోని 400 మంది ఐపీఎస్‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

Updated Date - Sep 24 , 2026 | 07:38 AM