Share News

షెల్టర్‌ హోమ్‌కు మానసిక రోగి తరలింపు

ABN , Publish Date - Mar 25 , 2026 | 09:18 AM

బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు వద్ద మానసిక రోగిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది బేగంపేట షెల్డర్‌ హోమ్‌కు తరలించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ట్వీట్‌కు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ స్పందించారు.

షెల్టర్‌ హోమ్‌కు మానసిక రోగి తరలింపు

  • ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ట్వీట్‌కు స్పందన

హైదరాబాద్: బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు వద్ద మానసిక రోగిని జీహెచ్‌ఎంసీ(GHMC) సిబ్బంది బేగంపేట షెల్టర్‌ హోమ్‌కు తరలించారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ట్వీట్‌కు జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ స్పందించారు. టోక్యో, సింగపూర్‌తో పోటీ పడాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకురావాల్సి ఉందని, బంజారాహిల్స్‌ కేబీఆర్‌ పార్కు(Banjara Hills KBR Park) సమీపంలో మతిస్థిమితం సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న వారి విషయంలో దృష్టి సారిస్తే ప్రజా భద్రత సాధ్యమవుతుందని ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ ట్వీట్‌ చేసింది.


ఖైరతాబాద్‌ సర్కిల్‌ జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ ప్రియాంక ఈ ట్వీట్‌కు స్పందించారు. వెంటనే సిబ్బందిని పంపించి మతిస్థిమితం లేని వ్యక్తిని పార్కు గేటు 6 వద్ద గుర్తించి బేగంపేట షెల్డర్‌ హోమ్‌కు తరలించారు. అతనికి ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో వైద్యం చేసేలా ఏర్పాట్లు చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించిన ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతికి జోనల్‌ కమిషనర్‌ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశారు. యాచకులు, మానసిక పరిస్థితి బాగోలేని వారికోసం తరచూ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు, ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

నేటి నుంచి భగభగలే!

941 కోట్లతో డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Mar 25 , 2026 | 09:29 AM