Share News

శాసనసభలో నేడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం..

ABN , Publish Date - Mar 25 , 2026 | 08:51 AM

తెలంగాణ శాసనసభ సమావేశాలు నేడు(బుధవారం) ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది.

శాసనసభలో నేడు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం..
Telangana Assembly Session

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు(Telangana Assembly Sessions) నేడు(బుధవారం) ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10గంటలకు ప్రశ్నోత్తరాలతో (Question Hour) సభ ప్రారంభం కానుంది. ఈరోజు సభలో రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) పలు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టనుంది. తెలంగాణ వస్తుసేవల పన్ను సవరణ బిల్లు-2026, వైద్య విధాన పరిషత్ రద్దు బిల్లు-2026, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ పట్టిక(బడ్జెట్)ను సభలో ప్రవేశపెట్టనున్నారు.


అలాగే వ్యవసాయ ఉత్పత్తులకు నిల్వ సౌకర్యాలు, రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం, సోలార్ మోడల్ స్కీమ్, అల్ప సంఖ్యాక వర్గాలకు సంక్షేమ పథకాలు, నూతన చౌక ధరల దుకాణాల ఏర్పాటు, సంక్షేమ శాఖలో కార్పొరేషన్లు, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, హైదరాబాద్‌లో సమీకృత రవాణా వ్యవస్థ, నర్సాపూర్ నియోజకవర్గంలో అల్ప సంఖ్యాక ఆశ్రమ పాఠశాలకు శాశ్వత భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలపై సభ్యులు చర్చించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఘోర రోడ్డుప్రమాదాలు.. మంచి చేయడానికి వెళ్లి..

యుద్ధం ఎఫెక్ట్‌.. మూతబడుతున్న పెట్రోల్‌ బంక్‌లు

Updated Date - Mar 25 , 2026 | 09:33 AM