Share News

ఘోర రోడ్డుప్రమాదాలు.. మంచి చేయడానికి వెళ్లి..

ABN , Publish Date - Mar 25 , 2026 | 08:10 AM

కర్నూలులో ఒకే చోట రెండు ఘోర రోడ్డుప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కర్నూలు చెన్నమ్మ సర్కిల్ వద్ద ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే..

ఘోర రోడ్డుప్రమాదాలు.. మంచి చేయడానికి వెళ్లి..
Road Accident in Kurnool

కర్నూలు: కర్నూలు(Kurnool)లో ఒకే చోట రెండు ఘోర రోడ్డుప్రమాదాలు (Road Accidents) చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కర్నూలు చెన్నమ్మ సర్కిల్(Chennamma Circle) వద్ద ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు.


అయితే, అదే సమయంలో వేగంగా వచ్చిన మరో లారీ వారిపైకి దూసుకెళ్లింది. దీంతో మరో ఇద్దరు స్పాట్‌లోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. యాక్సిడెంట్ జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, మంచి చేయడానికి వెళ్తే ఏకంగా ప్రాణాలు పోయాయంటూ స్థానికులు కన్నీటిపర్యంతం అయ్యారు. మరోవైపు బాధిత కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. కుటుంబసభ్యుడి మరణవార్త విన్న వారి రోదనలు మిన్నంటాయి. కాగా, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

విజయవాడ ఉగ్ర లింక్‌ కేసులో మరొకరు అరెస్ట్

పెద్దిరెడ్డికి సుప్రీంలో చుక్కెదురు!

Updated Date - Mar 25 , 2026 | 08:17 AM