Share News

హైదరాబాద్‌కు అనేక విద్యాసంస్థలు తీసుకువచ్చా: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:08 PM

హైదరాబాద్‌కు అనేక విద్యాసంస్థలు, నల్సార్‌, ట్రిపుల్‌ ఐటీ తీసుకువచ్చానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో కేవలం మంజీరా నుంచే తాగునీరు వచ్చేదని పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు అనేక విద్యాసంస్థలు తీసుకువచ్చా: సీఎం చంద్రబాబు
AP CM Chandra babu Naidu

హైదరాబాద్‌, మార్చి22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు అనేక విద్యాసంస్థలు, నల్సార్‌, ట్రిపుల్‌ ఐటీ తీసుకువచ్చానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. అప్పట్లో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో హైదరాబాద్‌ పేరు ఉండేదని వివరించారు. హైదరాబాద్‌కు బిల్‌ క్లింటన్‌ను తీసుకొచ్చానని పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కు తెచ్చేందుకు అనేకమందితో చర్చించానని అన్నారు. భారత్‌లో కంపెనీలు పెట్టాలని బిల్‌గేట్స్‌ను కోరానని తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ ఆఫీస్‌ పెట్టాలని బిల్‌గేట్స్‌ను కోరానని పేర్కొన్నారు.


దేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభం..

ఈరోజు(ఆదివారం) హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐఎస్‌బీలో సౌత్‌ ఏసియా లెర్నింగ్‌ సమ్మిట్‌ నిర్వహించారు. ఏఐ వినియోగం, విస్తరణ లక్ష్యంగా ఈ సదస్సులో చర్చించారు. ఈ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. గతంలో కేవలం మంజీరా నుంచే తాగునీరు వచ్చేదని పేర్కొన్నారు. కేవలం 9 నెలల్లోనే కృష్ణా నది నుంచి తాగునీరు తీసుకొచ్చామని తెలిపారు. 1990 తర్వాత మన దగ్గర ఇంటర్నెట్‌ ప్రారంభమైందని ప్రస్తావించారు. దేశంలో 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయని చెప్పుకొచ్చారు. అప్పటికీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఏపీ ఉందని గుర్తుచేశారు. 1995 నుంచి నాలెడ్జ్‌ ఎకానమీగా ఏపీ ఉందని వెల్లడించారు. మ్యాథ్స్, ఇంగ్లిష్‌లో భారతీయులకు మంచి పట్టు ఉందని చెప్పానని అన్నారు. హైదరాబాద్‌కు ఐఎస్‌బీ తీసుకురావడానికి ఎంతో కృషి చేశానని తెలిపారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు కోసం 5 వేల ఎకరాలు సేకరించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరు గ్యారంటీలు చట్టమైతే అన్నివర్గాలకు లాభం: కేటీఆర్

మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి షాక్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 04:21 PM