గంజాయి, డ్రగ్స్‌పై ప్రజలు యుద్ధం చేయాలి: డీజీపీ ఆనంద్
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:00 PM
పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితులతో ఫ్రెండ్లీగా ఉంటామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. రౌడీషీటర్లు తదితర నేరస్తుల విషయంలో కఠినంగానే ఉంటామని హెచ్చరించారు.
ఆదిలాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితులతో ఫ్రెండ్లీగా ఉంటామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) వ్యాఖ్యానించారు. రౌడీషీటర్లు, తదితర నేరస్తుల విషయంలో కఠినంగానే ఉంటామని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది పెట్టే ఎవరినీ కూడా వదలబోమని స్పష్టం చేశారు. ఈరోజు (బుధవారం) ఆదిలాబాద్ జిల్లాలో డీజీపీ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోషం గ్రామసభలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో నక్సలైట్ల సమస్య లేదని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఏడాది కాలంలో రోడ్డుప్రమాదాల్లో..1.70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని డీజీపీ చెప్పుకొచ్చారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్‌పై ప్రజలు యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. మైనర్ల డ్రైవింగ్.. దేశంలో పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. తల్లిదండ్రులు వారికి వాహనాలు కొనిస్తున్నారని.. అందువల్లే ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. అన్నీ సమస్యలు పోలీసులతోనే పరిష్కారం కావని... ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. భూపాలపల్లి, ఏటూరు నాగారం, నర్సంపేట, ఆదిలాబాద్ తదితర అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు ఉందని ప్రస్తావించారు. గంజాయి సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని, రైతుబంధు కూడా నిలిపి వేస్తున్నామని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News