Share News

ధర్మపురి ఉగ్రనరసింహ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన భట్టి విక్రమార్క

ABN , Publish Date - Sep 07 , 2026 | 08:21 AM

ధర్మపురి ఉగ్రనరసింహ ఆలయ పునర్నిర్మాణ పనులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం భూమిపూజ చేశారు. రూ.10 కోట్ల పుష్కరాల నిధులతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు.

ధర్మపురి ఉగ్రనరసింహ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన  భట్టి విక్రమార్క
Telangana Deputy CM Bhatti Vikramarka

జగిత్యాల, సెప్టెంబర్ 7 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి ఉగ్రనరసింహ ఆలయ పునర్నిర్మాణ పనులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Telangana Deputy CM Bhatti Vikramarka) ఈరోజు (సోమవారం) భూమిపూజ చేశారు. రూ.10 కోట్ల పుష్కరాల నిధులతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఉగ్రనరసింహ స్వామివారిని మంత్రులు భట్టి విక్రమార్క, అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. ధర్మపురి క్షేత్రానికి ఎంతో మహత్యం ఉందని ఉద్ఘాటించారు.


గోదావరి పుష్కరాలను అత్యద్భుతంగా నిర్వహిస్తాం..

బాసర నుంచి భద్రాచలం వరకు... గోదావరి తీరంలోని ఆలయాలను అభివృద్ధి చేస్తామని భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. రానున్న గోదావరి పుష్కరాలను అత్యద్భుతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.. ఈ పుష్కరాల నిర్వహణకు ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించామని స్పష్టం చేశారు. రూ.200 కోట్ల నిధులతో ధర్మపురి, కోటిలింగాల క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్నామని మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈహెచ్‌ఎస్‌ అమల్లో రాజీ లేదు: భట్టి విక్రమార్క

అసెంబ్లీ సమావేశాలకు అందరూ తప్పకుండా హాజరుకావాలి: కేసీఆర్

త్వరలో తెలంగాణ ఆర్టీసీ - హైదరాబాద్ మెట్రో రైల్ ఉమ్మడి పాస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 07 , 2026 | 08:37 AM