Share News

రేషన్‌ ఈకేవైసీకి అక్టోబరు నెలాఖరు వరకు గడువు.. మొబైల్‌తోనే పూర్తి చేసే అవకాశం

ABN , Publish Date - Sep 26 , 2026 | 01:01 PM

రేషన్‌ లబ్ధిదారులు ఈ-కేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం అక్టోబరు నెలాఖరు వరకు గడువు పొడగించింది.

రేషన్‌ ఈకేవైసీకి అక్టోబరు నెలాఖరు వరకు గడువు.. మొబైల్‌తోనే పూర్తి చేసే అవకాశం
Ration eKYC

  • అక్టోబరు నెలాఖరు వరకు గడువు

  • మొబైల్‌ నుంచే పూర్తి చేసుకునేలా ప్రత్యేక యాప్‌

పెంచికల్‌పేట్‌(మంచిర్యాల): రేషన్‌ లబ్ధిదారులు ఈ-కేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం అక్టోబరు నెలాఖరు వరకు గడువు పొడగించింది. జిల్లాలో 20 శాతం మంది ఈకైవేసీ చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం మూడు నెలల బియ్యం కోటా పంపిణీ పూర్తి అయింది. రేషన్‌ దుకాణాలను మూసివేశారు. ఈ నేపథ్యంలో ఇంటి నుంచే మోబైల్‌ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకునేలా ప్రత్యేక యాప్‌ను తీసుకొచ్చింది. పూర్తయిందో లేదో తెలుసుకు నేందుకు వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. లబ్ధిదారులకు కొంచెం అవగాహణ ఉంటే ఈ ప్రక్రియ సులువుగా పూర్తి చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.


ఓటీపీ ద్వారా..

ముందుగా మొబైల్‌లో పేస్టోర్‌ నుంచి మేరా ఈకేవైసీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆధార్‌పేస్‌ ఆర్డి యాప్‌ను ఓపెన్‌చేసి రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని ఆధార్‌ నంబర్‌, క్యాప్చను ఎంటర్‌ చేయాలి. వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫైచేసుకొని ఆధార్‌యాప్‌లో లబ్ధిదారుల ఫోటో వెరిఫికేషన్‌ పూర్తిచేస్తే ఈ- కైవేసి ప్రక్రియ పూర్తియి నట్లు సందేశం వస్తోంది.


xx.jpgపౌరసరఫరాల శాఖ వారి లింక్‌ ను ఉపయోగించి రేషన్‌ కార్డు నెంబరు, క్యాప్చను నమోదు చేస్తే కుటుంబీకుల వివరాలు కన్పిస్తాయి. పేర్ల పక్కన యా క్టివ్‌ అని కన్పిస్తే ఈ కేవైసీ అయినట్టు, ఒక వేళ ఇన్‌ యాక్టి వ్‌గా ఉంటే ఈ- కేవైసీ కానట్టు భావించాల్సి ఉంటుంది. జిల్లాలో ఇంకా 20శాతం ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంది. గత మూడునెలల నుంచి ఎన్‌ఫోర్సుమెంటు శాఖ ఆధ్వర్యం లో జిల్లా వ్యాప్తంగా అవగాహణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు.


అర్హులకు రేషన్‌ బియ్యం అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రక్రి యను చేపడు తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలని సూచిస్తున్నారు. రేషన్‌ చౌక దుకాణాల వద్దకు పోకుండా ఇంటి వద్దనే ఆన్‌లైన్‌ ద్వారా వెలుసుబాటు చేసుకు నేందుకు మోబైల్‌ యాప్‌ ద్వారా అవకాశం ఇవ్వడంతో అంతా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

సింగూరులో డేంజర్‌ బెల్స్‌

ఎల్‌నినో వేళ రైతులకు చామంతి కొత్త దారి..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 26 , 2026 | 01:01 PM