Share News

బంగారం, డబ్బు చూపించిన యూట్యూబర్.. రూ.కోటికి పైగా దోచుకెళ్లిన దొంగలు..

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:26 PM

తన ఇంట్లోని డబ్బు, బంగారం చూపిస్తూ వీడియో చేసిన ఓ యూట్యూబర్‌కు దొంగలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఆమె రూపొందించిన వీడియో ఆధారంగా సమాచారం సేకరించిన దొంగలు ఆమె ఇంటికి కన్నం వేసి రూ.కోటికి పైగా విలువైన ఆభరణాలను చోరీ చేశారు.

బంగారం, డబ్బు చూపించిన యూట్యూబర్.. రూ.కోటికి పైగా దోచుకెళ్లిన దొంగలు..
Tamil Nadu YouTuber

ఇంటర్నెట్ డెస్క్: తన ఇంట్లోని డబ్బు, బంగారం చూపిస్తూ వీడియో చేసిన ఓ యూట్యూబర్‌కు దొంగలు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఆమె రూపొందించిన వీడియో ఆధారంగా సమాచారం సేకరించిన దొంగలు ఆమె ఇంటికి కన్నం వేసి రూ.కోటికి పైగా విలువైన ఆభరణాలను చోరీ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌ సమీపంలో జరిగింది (Tamil Nadu YouTuber robbery).


నాగర్‌కోయిల్‌ సమీపంలోని తమత్తుకోణం ప్రాంతంలో వ్యాపారి వినోద్‌కుమార్‌, ఆయన భార్య మధుమిత తమ పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. మధుమిత యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తుంటారు. గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. రాత్రి తిరిగి వచ్చేసరికి ఇంటి వెనుక తలుపు తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూడగా గదిలోని బీరువా పగలగొట్టి ఉంది. అందులో ఉంచిన బంగారం, వజ్రాభరణాలు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు (Nagercoil YouTuber).


మధుమిత గతంలో తన వద్ద ఉన్న బంగారు నగలు, నగదు గురించి వీడియోలు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు (YouTuber gold theft). పరుపుపై పెద్ద మొత్తంలో నోట్ల కట్టలను ప్రదర్శిస్తూ, ఇంట్లోని బంగారు ఆభరణాలను మొత్తం చూపిస్తూ వీడియోలు చేసింది. అంతేకాకుండా బయటకు వెళ్లే సందర్భాల్లో తాము ఎక్కడికి వెళ్తున్నామో కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తుంటుంది. సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులు, వీడియోల ద్వారా ఇంట్లో ఎవరూ లేని విషయం దొంగలకు తెలిసిందా అని పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

ఒక ఉగ్రవాద దేశం నన్నే ప్రశ్నిస్తోందా.. పాక్ జర్నలిస్ట్‌కు జైశంకర్ ఘాటు రిప్లై..


స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 26 , 2026 | 12:47 PM